స్టార్ కమెడియ్ ప్రియదర్శికి ఘోర అవమానం, ఆడిషన్ కు వెళ్తే అంత పెద్ద మాట అన్నారా...?

By Mahesh Jujjuri  |  First Published Oct 27, 2022, 11:16 AM IST

టాలీవుడ్ లో ఇప్పుడున్న కమెడయిన్స్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. అయితే కమెడియన్ గా ఓ ఇమేజ్ సాధించిన దర్శి.. ఒకప్పుడు ఘోర అవమానం ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ప్రియదర్శి. ఇంతకీ ఆయన్ను అవమానించింది ఎవరు..? 
 



టాలీవుడ్ లో ఇప్పుడున్న కమెడయిన్స్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. అయితే కమెడియన్ గా ఓ ఇమేజ్ సాధించిన దర్శి.. ఒకప్పుడు ఘోర అవమానం ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ప్రియదర్శి. ఇంతకీ ఆయన్ను అవమానించింది ఎవరు..? 

ఏమంటా పెళ్లి చూపులు సినిమా వచ్చిందో.. చాలా కాలంగా కష్టపడుతున్న ప్రియదర్శికి కమెడియన్ గా మంచి ఇమేజ్ వచ్చింది. దాంతో పాటు వరుస అవకాశాలు కూడా తీసుకువచ్చింది. అంతే కాదు ఈసినిమాతో సైమా, ఐఫా అవార్డ్ లు కూడా అందుకున్నాడు ప్రియదర్శి.  వెంటనే వరుసగా సినిమాలు తగిలాయి ప్రియదర్శికి.  అతను కూడా వచ్చిన అవకాశాన్ని వినియోనించుకుంటూ.. తన టాలెంట్ తో ఎదుగుతూ వస్తున్నాడు. తెలంగాణ స్లాంగ్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలో వేరియేషన్, ఇతర కమెడియన్లను ఫాలో అవ్వకుండా తనకంటూ సొంత బాడీ లాంగ్వేజ్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు ప్రియదర్శి. 

Latest Videos

పెళ్ళి చూపులు తరువాతఅర్జున్ రెడ్డి,  ఘాజీ, జై లవకుష, జాతిరత్నాలు, రాధే శ్యామ్,  సీతారామం, ఒకే ఒక జీవితం లాంటిసినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ప్రియదర్శి.  అటువంటి ప్రియదర్శి ఇండస్ట్రీని అంత ఈజీగా రాలేదట. అంత ఈజీగా తన తేరంగేట్రం జరగలేదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియదర్శి వెల్లడించారు. తను టెర్రర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడట. నిజానికి ఆయన ఇండస్ట్రీకి సినిమాటోగ్రాఫర్ అవ్వాలని వచ్చారు. ఇంటి దగ్గర ఇదే విషయాన్ని చెప్పారట.

అయితే అవకాశాల కోసం చూస్తున్న టైమ్ లో.. నటుడిగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని చూశారట దర్శి. ఒక చోట ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళారట. అప్పుడు ప్రియదర్శిని చూసిన వారు నువ్వు నటనకు పనికి రావు... నల్లగా.. బక్కగా ఉన్నావు అంటూ ఘోరంగా అవమానించారట. ఇక అందులో ఒకరు మాత్రం తనకు కావల్సిన పాత్ర నీలాగే ఉండాలి అని చెప్పి ఫోన్ చేసి మరీ టెర్రర్ సినిమాలో అవకాశం ఇచకచారు అని అన్నారు ప్రియదర్శి. అంతే కాదు తను అప్పుడు అలా అవమాన పడబట్టే.. ఎక్కువ కసితో పనిచేశానన్నారు ప్రియదర్శి. 

click me!