కరోనా విలయంం కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో విషాదం..

Published : May 15, 2021, 04:54 PM IST
కరోనా విలయంం కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో విషాదం..

సారాంశం

కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సిద్ధార్థ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాకి గురైన ఆయన కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా విలయం మరింతగా విజృంభిస్తోంది. అది అనేక మందిని బలితీసుకుంటుంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. సినీ సెలబ్రిటీలు చాలా మంది కరోనాతో కన్నమూశారు. తాజాగా కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సిద్ధార్థ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాకి గురైన ఆయన కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

గౌతంరాజు సోదరుడు సిద్ధార్థకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తన సోదరుడు మరణ వార్తని గౌతంరాజు పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తమ ఇంట్లో నెలకొన్న విషాదాన్ని తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. బయట పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని, అందరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీంతో గౌతంరాజు సోదరుడి మృతి  పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గౌతంరాజు నటుడిగా, కమెడీయన్‌గా అనేక చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?