Ali's daughter: అలీ కలను నిజం చేసిన పెద్ద కుమార్తె.. ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు

Published : Apr 12, 2022, 02:48 PM IST
Ali's daughter: అలీ కలను నిజం చేసిన పెద్ద కుమార్తె.. ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు

సారాంశం

టాలీవుడ్ లో ఇప్పుడున్న చాలా మంది సీనియర్ నటుల కంటే సీనియర్ కమెడియన్ అలీ. చెడ్డీలు వేసుకునే వయసు నుంచే అలీ టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కూడా నటించాడు.

టాలీవుడ్ లో ఇప్పుడున్న చాలా మంది సీనియర్ నటుల కంటే సీనియర్ కమెడియన్ అలీ. చెడ్డీలు వేసుకునే వయసు నుంచే అలీ టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కూడా నటించాడు. దాదాపు వెయ్యి చిత్రాల్లో అలీ నటించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అలీ చెరగని ముద్ర వేశారు. 

ఇప్పటికి నటుడిగా కొనసాగుతూ టీవీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగితేలుతోంది. ఆలీకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా తాజాగా తన డాక్టర్ చదువుని పూర్తి చేసి పట్టా అందుకుంది. దీనితో ఫాతిమా.. డాక్టర్ ఫాతిమాగా మారింది. 

తన కుమార్తె డాక్టర్ కావాలనేది అలీ కోరిక అట. తండ్రి కలని నెరవేరుస్తూ ఆమె డాక్టర్ కావడంతో వారి ఫ్యామిలిలో సంతోషాలు వెళ్లి విరిస్తున్నాయి. తమ కుటుంబంలో ఫాతిమానే తొలి డాక్టర్ అని అలీ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. 

అలీ తన వృత్తి తో పాటు కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తారు. కమెడియన్ గా అలీది విభిన్నమైన శైలి. తనకు మాత్రమే సాధ్యమైన మాడ్యులేషన్ తో వెరైటీ పదాలు పలుకుతూ హాస్యం పుట్టించగలడు. ఏది ఏమైనా అలీ కుమార్తె డాక్టర్ కావడంతో నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sobhita: ప్రెగ్నెన్సీ వార్తలపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చేసిన శోభితా.. ఇప్పుడు ఫోకస్‌ అంతా అటు షిఫ్ట్
Anil Ravipudi నెక్స్ట్ మూవీ ఎవరితో ? వివి వినాయక్ కి కూడా సాధ్యం కాని రేర్ రికార్డ్ కి చేరువలో..