Ranbir-Alia Marriage: త్వరగా పిల్లల్ని కను, రణబీర్ కు సంజయ్ దత్ సలహా

Published : Apr 12, 2022, 02:41 PM IST
Ranbir-Alia Marriage: త్వరగా పిల్లల్ని కను, రణబీర్ కు సంజయ్ దత్ సలహా

సారాంశం

రణ్ భీర్ కపూర్ ఆలియా భట్ పెళ్ళిపై కన్ ఫ్యూజన్ ఏర్పడిన వేళ.. బాలీవుడ్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు ఈలవ్ బర్డ్స్ కు. రీసెంట్ గా సంజయ్ దత్త్ కూడా రణ్ భీర్ కు విలువైన సలహా ఇచ్చాడు. 

రణ్ భీర్ కపూర్ ఆలియా భట్ పెళ్ళిపై కన్ ఫ్యూజన్ ఏర్పడిన వేళ.. బాలీవుడ్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు ఈలవ్ బర్డ్స్ కు. రీసెంట్ గా సంజయ్ దత్త్ కూడా రణ్ భీర్ కు విలువైన సలహా ఇచ్చాడు. 

ఈనెలోనే పపెళ్లి పీటలు ఎక్కబోతున్నారు  బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియాభట్, రణబీర్ కపూర్. ఈ ముద్దుల జంటకు  స్టార్స్ నుంచి రకరకాల సలహాలు సూచనలు అందుతున్నాయి. ఇక రీసెంట్ గా  సీనియర్ నటుడు సంజయ్ దత్ వీరిద్దరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు రణ్ భీర్ కు విలువైన సలహా కూడా ఓకటి ఇచ్చాడు సంజయ్ దత్త్. 

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో అధీరాగా సంజయ్ దత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక.. రణబీర్, అలియా భట్  పెళ్శికి  భారీ స్థాయిలో ఎవరినీ పిలవడం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు .. కొద్ది మంది కుటుంబ సభ్యులు తప్పించి ఇతరులకు ఆహ్వానం లేదని తెలుస్తోంది.  అయితే వీరు పెళ్లి రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యే అవకాశం ఉంది. 

ఇక రీసెంట్ గా సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడిన సందర్భంగా రణబీర్ వివాహం విషయమై సంజయ్ దత్ తన అభిప్రాయాలను తెలియజేశారు. రణబీర్ కపూర్ పెళ్లి చేసుకునేట్టు అయితే నిజంగా నాకు సంతోషమే. అలియా నా ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. వివాహం అన్నది ఒకరి పట్ల మరొకరు నిబద్ధత కలిగి ఉండడం, కొంత రాజీ పడడం. దానికి వారు కట్టుబడి ఉండాలి అన్నారు. 

అంతే కాదు ఒకరి చేయి మరొకరు పట్టుకుని సంతోషం, శాంతి, కీర్తితో  జీవితంలో ముందుకు సాగిపోవాలి అని ఆకాంక్షించారు సంజయ్. ఇక రణబీర్ కు సలహా ఇస్తూ..  పెళ్శి తరువాత లేట్ చేయకుండా  త్వరగా పిల్లల్ని కను. సంతోషంగా ఉండు అని సంజయ్ అన్నారు. ఇక    ఈ స్టార్ లవర్స్ పెళ్ళిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరు ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. 

అయితే ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు పెళ్ళి ఎప్పుడు జరిగినా.. పకడ్బందీగా ఏర్పాట్లు మాత్రం చేసుకుంటున్నారు. మీడియాకు చిన్న ఫోటో కూడా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేస్తే తప్పించి.. మరే వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారట సెలబ్రిటీలు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లు వాళ్ళ వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి కోసం సినమా షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. ఆక రణ్ భీర్,ఆలియా జంటగా నటించిన బ్రహ్మస్త్రం మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్