1996 Dharmapuri Movie: శేఖర్ మాస్టర్ సమర్పణ, మారుతి పర్యవేక్షణలో ‘1996 ధర్మపురి’.. విడుదలకు తేదీ ఖరారు..

Published : Apr 12, 2022, 02:28 PM IST
1996 Dharmapuri Movie: శేఖర్ మాస్టర్ సమర్పణ, మారుతి పర్యవేక్షణలో ‘1996 ధర్మపురి’.. విడుదలకు తేదీ ఖరారు..

సారాంశం

స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) సమర్పణలో రూపుదిద్దుకున్న  చిత్రం ‘1996 Dharmapuri’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి పర్యవేక్షించారు. తాజాగా మేకర్స్ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు.   

 భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘1996 ధర్మపురి’. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అలరించిన శేఖర్ మాస్టార్.. ఇకపై నిర్మాతగానూ కనిపించనున్నారు.  గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకు శేఖర్ మాస్టరే స్వయంగా కొరియోగ్రఫీ చేశారు.  

అయితే 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రత్యేకంగా నల్లరేణి కళ్ళధానా సాంగ్ పెద్ద హిట్ అయింది.  ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న 1996 ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే... డైరెక్టర్ మారుతి ఈ మూవీ చిత్రీకరణను పర్యవేక్షించారు. తన అనుభవంతో 1996 ధర్మపురిని ఆడించేందుకు సలహాలు, సూచనలు చేశారంట. అయితే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు. చేశారు. ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారకు.  

ధ‌ర్మ‌పురిలో వుండే దొర గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథగా ఈ 1996 ధర్మపురి ఉండబోతోంది.  అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించడం విశేషం. హీరోహీరోయిన్లుగా గగన్ విహారి, అపర్ణ దేవి నటిస్తుండగా.. నటీనటులుగా  అఖండ నాగ మహేష్, పలాస జనార్దన్, కేశవ, నారాయణ స్వామి, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు పలు పాత్రలు పోషిస్తున్నారు.  రచన, దర్శకత్వం జగత్ వహించగా.. నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి చిత్రాన్ని నిర్మించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు