ఎర్ర కండువా, ఖుషి, ఓజి..దానికి పవర్ ఎక్కువ, పవన్ పేరెత్తకుండా మోత మోగించిన అలీ

By tirumala AN  |  First Published Aug 25, 2024, 10:36 AM IST

రాజకీయాలని పూర్తిగా పక్కన పెట్టిన అలీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. అయితే ఇటీవల ఆలీకి సరైన రిజల్ట్ రాలేదు. అలీ నటించిన బడ్డీ, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి.


రాజకీయాలని పూర్తిగా పక్కన పెట్టిన అలీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. అయితే ఇటీవల ఆలీకి సరైన రిజల్ట్ రాలేదు. అలీ నటించిన బడ్డీ, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. దీనితో అలీ తనకి కంబ్యాక్ ఇచ్చే చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. 

త్వరలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో అలీ నటించారు. శనివారం రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ తో అలీకి కాస్త గ్యాప్ వచ్చింది. కానీ ఇటీవల అలీ పరోక్షంగా పవన్నామ స్మరణ చేస్తున్నాడు. 

Latest Videos

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ పవన్ పేరెత్తకుండానే పలు మార్లు పవన్ గుర్తుకు వచ్చేలా కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. సరిపోదా శనివారం చిత్రంలో నాని ఉపయోగించిన కడియం, ఎర్ర తుండు, బుక్ ని యాంకర్ సుమ అలికి ఇచ్చింది. అలీ మాత్రం ఎర్ర తుండు తీసుకున్నాడు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటో వాళ్ళకి తెలుసు అంటూ పవన్ గుర్తుకు వచ్చేలా అలీ కామెంట్స్ చేశాడు. ఈ ఎర్ర రక్తం మన ఒంట్లో ఉంటే దానికి పవర్ ఎక్కువ అని అలీ ప్రస్తావించారు. 

నానిపై అలీ ప్రశంసలు కురిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తన కష్టంతో నాని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు అని అలీ అభినందించారు. మా ఖుషి డైరెక్టర్ సూర్య ఇక్కడే ఉన్నారు. ఈ చిత్రంలో నాని పేరు కూడా సూర్యనే. ఇద్దరు సూర్యలు కలిస్తే అదిరిపోతుంది అని అలీ అన్నారు. ఇక దానయ్య ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆయన ఓజి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మూవీలో తాను నటిస్తునట్లు అలీ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ సంతోషాన్ని తెలియజేశారు. 

click me!