బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో నా పేరు ఉంది... కీలక విషయాలు బయటపెట్టిన బర్రెలక్క!


కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుండగా ఆమె స్పష్టత ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా కీలక విషయాలు బయట పెట్టింది... 
 



ఏడాది కాలంగా మీడియాలో బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సోషల్ మీడియా స్టార్ ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయడం ఇందుకు కారణం. ఎలాంటి నేపథ్యం లేని కర్నె శిరీష డిగ్రీ పూర్తయ్యాక సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ప్రారంభించింది. చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు. అందుకే బర్రెలు కాసుకుంటున్నా, అంటూ ఆమె చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ విధంగా శిరీష కాస్తా... బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది. 

నిరుద్యోగుల బాధలు తెలియజేస్తూ, వారి ప్రతినిధిగా బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమెకు చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయి. బర్రెలక్క తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం విశేషం. బర్రెలక్క కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమ్ రీత్యా ఆమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అవకాశం వచ్చిందని గట్టిగా ప్రచారం అవుతుంది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బర్రెలక్క దీనిపై క్లారిటీ ఇచ్చింది. 

Latest Videos

బర్రెలక్క మాట్లాడుతూ.. ఈ మధ్య చాలా మంది నన్ను అక్కా... మీరు బిగ్ బాస్ షోకి వెళుతున్నారా? అని అడుగుతున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్స్ నాకు అవకాశం వచ్చిందంటూ చేసిన వీడియోలు... ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో నా పేరు ఉంది. అయితే ఈమెకు ఫేమ్ తగ్గిపోయింది. తీసుకోవడం అవసరమా? అని ఆలోచిస్తున్నారట. 

మనిషి ప్రాణమే శాశ్వతం కాదు. ఫేమ్ శాశ్వతమా. హిట్ సినిమా కూడా థియేటర్స్ లో నెల రోజులే అడుగుతుంది. సూపర్ హిట్ మూవీ రెండు నెలలు అడుగుతుంది. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, రాకున్నా ఇబ్బంది ఏం లేదు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నన్ను ఇష్టపడే అభిమానులకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, వీడియో చేశాను... అని అన్నారు. 

కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8లో బర్రెలక్క పాల్గొనడం లేదు. ఆమెను ఎవరూ సంప్రదించలేదని మాటలను బట్టి తెలుస్తుంది. అలాగే పరువు హత్య బాధితురాలు అమృత ప్రణయ్ సైతం బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. ఆమె సైతం సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని ఆమె వెల్లడించారు. నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్నానన్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చారు. 

click me!