ఆ వేధింపులపై కలర్స్ స్వాతి ఏమందంటే..?

Published : Jul 15, 2018, 11:02 AM IST
ఆ వేధింపులపై కలర్స్ స్వాతి ఏమందంటే..?

సారాంశం

కాస్టింగ్ కౌచ్ కు అమ్మాయిలు ఎస్ చెప్పినా.. నో చెప్పినా.. ఆమె గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. ఒకవేళ నో చెప్తే మాత్రం ఆమె అంత ఫ్రెండ్లీ కాదు.. కలిసి పని చేయడం కష్టం ఇలా ఏవేవో చెబుతారు. మనం ఎంత బాగున్నా.. మనుషులన్నాక ఏదోకటి మాట్లాడుతూనే ఉంటారు

బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన స్వాతి ఆ తరువాత నటిగా కూడా బిజీ అయ్యారు. అయితే తెలుగులో మాత్రం హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ రాలేదు. కానీ తమిళ, మలయాళ చిత్రాలలో మాత్రం అవకాశాలు దక్కించుకున్నారు. ఆమెను హీరోయిన్ గా చేసిన తొలి సినిమా కూడా తమిళ చిత్రమే కావడం గమనించాల్సిన విషయం. ఆ సినిమా విడుదలయ్యి ఇప్పటికి దశాబ్దం అవుతోంది. 

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వాతి కాస్టింగ్ కౌచ్ విషయంపై స్పందించింది. కష్టాలనేవి ఇంట్లో కుడా ఉంటాయని మనం పని చేసే చోట ఉండవా అని ప్రశ్నించింది. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో ఎవరూ నేరుగా మాట్లాడరని చెప్పింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చింది. అలానే మరికొన్ని కామెంట్స్ చేసింది.

 ''కాస్టింగ్ కౌచ్ కు అమ్మాయిలు ఎస్ చెప్పినా.. నో చెప్పినా.. ఆమె గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. ఒకవేళ నో చెప్తే మాత్రం ఆమె అంత ఫ్రెండ్లీ కాదు.. కలిసి పని చేయడం కష్టం ఇలా ఏవేవో చెబుతారు. మనం ఎంత బాగున్నా.. మనుషులన్నాక ఏదోకటి మాట్లాడుతూనే ఉంటారు'' అని వెల్లడించింది.  

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..