యానిమల్ సినిమా అరుదైన రికార్డ్. కెనడాలో ఏం జరిగిందంటే..?

Published : Dec 31, 2023, 02:21 PM IST
యానిమల్ సినిమా అరుదైన రికార్డ్. కెనడాలో ఏం జరిగిందంటే..?

సారాంశం

ఈమధ్య ఇండస్ట్రీ టైమ్ బాగున్నట్టుంది. వచ్చిన ప్రతీ సినిమా హిట్ అవ్వడమే కాకుండా..ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సినిమా సినిమాకు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతోంది. తాజాగా రణ్ బీర్ కపూర్ నటించని యానిమల్ సినిమా కూడా అట్టాంటిదేదో సాధించిందట చూద్దాం.  


టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగా3..  బాలీవుడ్ స్టార్ హీరో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న  న‌టుడు రణ్‌బీర్‌ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా యానిమల్. పేరుకు తగ్గట్టే.. ఈసినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కృర జంతువు కన్నా దారుణంగా ఉంటుంది. టాలీవుడ్ బాలీవుడ్ టాలెంట్ కాంబోలో వ‌చ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్ యానిమల్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంచలనంగా మారింది. 

ఫాదర్ సెంటిమెంట్ తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ సంచలన విజయంతో పాటు.. వివాదాలను కూడా క్రియేట్ చేసింది. ఈసినిమాను చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు చూడకంటంటూ.. స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చెప్పాడంటే..ఈమూవీ ప్రభావం ఎంత ఉందో అర్ధం అవుతుంది. ఈక్రమంలో యానిమల్ సినిమా వద్దు వద్దు అనుకుంటే చూసినవారు చాలా మంది ఉన్నారు.అందుకే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూల్లు సాధించి.. కాసుల వర్షం కురిపించిందీ మూవీ.  ఇప్పటి వరకూ దాదాపు 900 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

ఇక  ఏడాది విడుద‌లైన ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో యానిమ‌ల్ కూడా చోటు సంపాదించుకుంది.ఇదిలావుంటే.. ఈ మూవీ తాజాగా అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీ కెనడాలోని సిల్వ‌ర్ సిటీ అనే థియేట‌ర్‌లో ఏకంగా 5 లక్షల కెనడా డాలర్లు అంటే ఏకంగా 3.15 కోట్లు ఒక్క థియేటర్ లోనే వసూలు చేసి రికార్డ్ సాధించింది.  ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క థియేట‌ర్‌లోనే ఇంత క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా యానిమల్ రికార్డు సృష్టించింది. మ‌రోవైపు ఈ సినిమా ఓటీటీ వెర్ష‌న్‌కు 20 నిమిషాలు జ‌త చేయ‌నున్న‌ట్లు సందీప్ ప్ర‌క‌టించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా