ప్రముఖ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు ఇకలేరు

First Published Oct 9, 2017, 5:35 PM IST
Highlights
  • మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు కన్నుమూత
  • ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన హరనాథరావు
  • 150కి పైగా చిత్రాలకు మాటలు అందించిన హరనాథరావు

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు సోమవారం కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  ఆయన స్వస్థలం ఒంగోలు. హరనాథరావుకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

హరనాథరావు 150కిపైగా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ‘ప్రతిఘటన’, ‘భారతనారి’, ‘స్వయంకృషి’, ‘సూత్రధారులు’, ‘రాక్షసుడు’లాంటి సినిమాలు మాటల రచయితగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కేవలం రచయితగానే కాకుండా కొన్ని చిత్రాల్లో సహాయనటుడి పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ‘రాక్షసుడు’, ‘స్వయం కృషి’ చిత్రాలు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన నాలుగు నంది అవార్డులు అందుకున్నారు.   రక్తబలి, జగన్నాథ రథచక్రాలు వంటి నాటికల్లో కూడా హరనాథరావు నటించారు.

click me!