CID: వేదిస్తున్నారు కాపాడండి, పోలీసులను ఆశ్రయించిన సిఐడి నటి

Published : Dec 16, 2023, 10:12 AM IST
CID: వేదిస్తున్నారు కాపాడండి, పోలీసులను ఆశ్రయించిన సిఐడి నటి

సారాంశం

తనకు ప్రాణహాని ఉంది అంటూ.. ప్రముఖ బాలీవుడ్ నటి పోలీసులను ఆశ్రయించింది. సిఐడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన ఈ నటి.. తన ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తోంది. 

నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి అంటూ.. వేడుకుంటుంది ప్రముఖ బాలీవుడ్ నటి వైష్ణవి ధనరాజ్. సీఐడీ సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి వైష్ణవి ధనరజ్. తన కుటుంబసభ్యులు తనపై శారీరక హింసకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా  ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తనను కాపాడాలని..తన ఒంటిపై గాయాలను చూపిస్తూ వీడియో చేయడం కలకలం రేపింది. 

Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమా ఏదో తెలుసా..?

ఈ వీడియోలో ఆమె ఏమంటుందంటే..? నాకు సాయం కావాలి. నేను కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో ముంబై లో  ఉన్నాను. నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడింది. నాతో దారుణంగా వ్యవహరించారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా బంధించారు. ఎలాగొలా తప్పించుకుని నేను బయట పడ్డాను అంటూ.. వేడుకుంది. న్యూస్ ఛానల్స్‌తో పాటూ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అని ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో తన నోరు, కుడిచేయి మణికట్టుపై ఉన్న గాయాలను కూడా ఆమె కెమెరాకు చూపించింది. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇక ఈ విషయంలో పోలీసులు కూడా స్పందించారు.  వైష్ణవి ఫిర్యాదు మేరకు  తన కుటుంబసభ్యులపై కేసున నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

 

వైష్ణవి 2016లో నటుడు నితిన్ షెరావత్‌ను పెళ్లి చేసుకుని ఆ తరువాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. సిఐడి సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యింది. అయితే తనపై తన తల్లీ తండ్రులే దాడి చేస్తున్నారని. తనను వేదిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తోంది. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం