థోర్ సూపర్ హీరో క్యారెక్టర్‌పై వస్తున్న నాలుగో సినిమా. మార్వెల్ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe’s) సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఫేస్ 4 సినిమాలను విడుదల చేస్తోంది ఎంసీయూ. ఇప్పిటకే స్పైడర్ మ్యాన్ నో వేహోంతో రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ ఏడాది కూడా వరుసగా సూపర్ హీరోల సినిమాలు విడుల చేస్తోంది. 2022లో మొదట మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇది డాక్టర్ స్ట్రేంజ్ సిరీస్ నుంచి వచ్చిన రెండో సినిమా. ఈ సినిమాను మే 6, 2022న థియేటర్లలో విడుదల చేసారు.
అలాగే మార్వెల్ సూపర్ హీరోల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్ థోర్. ఈ సూపర్ హీరో సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జూలై 8, 2022న థోర్ లవ్ అండ్ థండర్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇది థోర్ సూపర్ హీరో క్యారెక్టర్‌పై వస్తున్న నాలుగో సినిమా. మార్వెల్ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. థోర్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. ట్రైలర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు.
ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత నుంచి కొనసాగడం ట్రైలర్ లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్‌వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని టీమ్ తో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.