Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు!

By Sambi ReddyFirst Published May 24, 2022, 2:12 PM IST
Highlights

దర్శకుడు వర్మపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్స్ కి చెందిన శేఖర్ రాజు వ్యక్తి వర్మ తన వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదని పిర్యాదు చేశారు. 
 

2019 నవంబర్ లో హైదరాబాద్ శివారులో జరిగిన దిశా సంఘటన ఆధారంగా వర్మ ఆశ ఎన్కౌంటర్ టైటిల్ తో ఓ మూవీ నిర్మించారు. ఈ సినిమా అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. ఎట్టకేలకు 2021 జనవరిలో విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాతనంటూ రూ. 56 లక్షల రూపాయలు తీసుకున్న వర్మ తిరిగి చెల్లించలేదని శేఖర్ రాజు ఆరోపిస్తున్నారు. ఆశ విడుదలకు ముందే తన డబ్బులు తిరిగి చెల్లిస్తానని వర్మ మాటిచ్చారు. అలాగే ఆశ చిత్ర నిర్మాత తనే అంటూ నమ్మబలికాడని అంటున్నారు. 

శేఖర్ రాజు కథనం మేరకు... కొన్నాళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మ(Ram Gopal Varma)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను వర్మకి జనవరి 2020లో రూ. 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో రూ. 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చాను. ఈ మొత్తాన్ని వర్మ ‘ఆశ’ సినిమా విడుదలకు ముందే తనకి తిరిగి ఇస్తానని హామి ఇచ్చారు. అయితే వర్మ చెప్పిన సమయం దాటిపోయింది, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని తెలిసి మోసపోయినట్లు గ్రహించానని అందుకే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, రాజు చెప్పారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా పోలీసులు విచారణ చేపట్టారు.ఐపీసీ  406, 417, 420, 506 సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు.  ఇక వర్మకు వివాదాలేమీ కొత్తేమి కాదు. ఇటీవల 'డేంజరస్ నా ఇష్టం' మూవీ విడుదల విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్ర విడుదల నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు మే 6న ఈ చిత్రాన్ని వర్మ విడుదల చేశారు. 

click me!