తీవ్ర విషాదం.. వడదెబ్బతో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

Published : Jun 18, 2023, 06:24 PM ISTUpdated : Jun 18, 2023, 06:37 PM IST
తీవ్ర విషాదం.. వడదెబ్బతో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

సారాంశం

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి తోడు ఆయన విజయనగరం నుంచి వస్తుండడంతో వడదెబ్బ తగిలింది. దీనితో ఆయన ఆరోగ్యం క్షీణించి రక్త విరేచనాలు మొదలయ్యాయి. 

గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడా చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. బుల్లితెరపై ఆట షోతో రాకేష్ మాస్టర్ కెరీర్ ప్రారంభించారు. అక్కడ పాపులర్ అయ్యాక అనేక చిత్రాలకు అద్భుతమైన డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. 

అయితే కొన్నేళ్లుగా రాకేష్ మాస్టర్ డ్యాన్స్ పరంగా యాక్టివ్ గా లేరు. అనేక వివాదాస్పద సంఘటనలు, యూట్యూబ్ లో ఆయన చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతూ వచ్చాయి. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఆ ఛానల్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తన తోటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ వల్లే తన కెరీర్ నాశనం ఐయ్యిందని కూడా రాకేష్ మాస్టర్ తరచుగా చెబుతుంటారు. 

అంతే కాకుండా అనేక వ్యసనాలు రాకేష్ మాస్టర్ ఆరోగ్యాన్ని క్షీణించేలా చేయసాయనే ప్రచారం కూడా ఉంది. దీనివల్ల ఆయన మతిస్థితిమితం కోల్పోయినట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్, ఇతర యంగ్ కొరియోగ్రాఫర్స్ రాకేష్ మాస్టర్ శిష్యరికం నుంచి వచ్చిన వారే. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకి శాంతి కలగాలని సంతాపం తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా