టాలీవుడ్ లో విషాదం.. రచయిత అనుమానాస్పద మృతి.. రీజన్ అదేనా? కన్నీళ్లు ఆగవు..

By Asianet News  |  First Published Jun 18, 2023, 5:31 PM IST

చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఎళ్లుగా టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రచయిత అనుమానాస్పద స్థితితో మృతిచెందడం అందరినీ కలిచివేస్తోంది. 
 


తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు, దర్శకులు గతేడాది నుంచి ఇప్పటి వరకు చాలా మందే కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణం రాజు,  కృష్ణ, చలపతి రావు, కే విశ్వనాథ్, రీసెంట్ గా శరత్ బాబు, ప్రముఖ సింగర్ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొంద మంది సినీ పరిశ్రమకు చెందిన వారు మరణించారు. ఇక తాజాగా టాలీవుడ్ కథా రచయిత మరణించడం అందరినీ బాధిస్తోంది. 

సినీ రచయి కీర్తి సాగర్ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున టెర్రస్ పై ఆయన డెడ్ బాడీ కనిపించినట్టు తెలస్తోంది. ఉదయాన్నే లేచిన కీర్తి సాగర్ ఫ్రెండ్ బాడీని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీర్తి సాగర్ అప్పటికే మరణించినట్టు గమనించారు. ఈ సందర్భంగా అతని గదిలో, పరిస ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సాగర్ రూమ్ మొత్తం పుస్తకాలు, ఆయన రాసుకున్న కథలతో కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Latest Videos

ఇదిలా ఉంటే.. కీర్తి సాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కొన్నేండ్ల కిందనే సినిమాల్లో రచయితగా గుర్తింపు పొందాలని హైదరాబాద్ కు వచ్చారు. కొంతకాలంగా షేక్ పేట్ లోని తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కథలను కూడా రాశారు. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ట్రై చేశారని, కానీ ఎక్కడా ఫలితం దక్కకపోవడంతో మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. 

అవకాశాలు రాకపోవడంతోనే కీర్తి సాగర్ ఆత్మహత్య చేసుకున్నారేమోనని అనుమానం వ్యక్తం అవుతున్నాయి.  మరోవైపు కీర్తి సాగర్ మరణవార్తను తన కుటుంబ సభ్యులకు తెలియజేసినా పట్టింపు లేనట్టుగా ఉన్నారని, కనీసం మృతదేహాం కూడా తీసుకెళ్లడానికి ఎవరూ రావట్లేదని తెలుస్తోంది. దీంతో మార్చురీలో డెడ్ బాడీని భద్రపరిచారని సమాచారం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!