తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కోలీవుడ్ లో కలకలం రేపింది. చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకోగా దీనిపై పలు అనుమానాలు రేగుతున్నాయి. చిత్రను ఆమె భర్త హేమనాధ్ కొట్టి చంపారని చిత్ర తల్లి ఆరోపిస్తున్నారు.
చిత్ర శరీరంపై గాయాలు ఉండడంతో పాటు, ఆమె నాలుగు రోజులుగా హోటల్ లో బస చేయాల్సిన అవసరం ఏమిటనే కోణంలో పోలీసుల విచారణ సాగుతుంది. ఇరు పెద్దల అంగీకారంతో చిత్ర, హేమనాథ్ నిశితార్థం జరిగింది. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరింది. ఐతే వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని సమాచారం. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకున్నాక కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హేమనాథ్ ని పోలీసులు అనేక కోణాలలో విచారిస్తున్నారు. ఇక చిత్ర తల్లి హేమనాథ్ తన కూతురిని కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక హేమనాథ్ హస్తం ఉందని ఆమె మీడియాతో తెలియజేశారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరగాలని, డిమాండ్ చేస్తున్నారు. నిశ్చితార్ధం తరువాత హేమనాథ్ నిజస్వరూపం బయటపడింది. దానితో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని చిత్ర తల్లి ఆరోపించడం జరిగింది.