విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసిన తమన్నా

Published : Dec 11, 2020, 09:51 AM IST
విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసిన తమన్నా

సారాంశం

స్టార్ హీరోయిన్ తమన్నా విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసింది. సమంత నిర్వహిస్తున్న టాక్ షో సామ్ జామ్ లో పాల్గొన్న తమన్నా ఈ కామెంట్ చేశారు.   

 
వెండి తెరపై లిప్ లాక్ సీన్ చేయననే రూల్ బ్రేక్ చేస్తే... ఎవరితో ఆ సీన్ లో నటిస్తారని సమంత అడుగగా, విజయ్ దేవరకొండతో చేస్తానని టక్కున చెప్పేసింది తమన్నా.  విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లో ఉండగా, ఆయనతో నటించాలనే కోరికను తమన్నా అలా బయటపెట్టారు. ఇక మీరు కవితలు కూడా రాస్తారటగా అని సమంత అడిగారు. దానికి తమన్నా.. మీ హార్ట్ బ్రేక్ అయితే, ఆటోమేటిక్ గా కవి అయిపోతారని అన్నారు. తమన్నా హార్ట్ బ్రేక్ చేసిన ఆ వ్యక్తి ఎవరని సమంత క్రేజీగా స్పందించారు. 
 
ఇక హీరోయిన్ గా 15ఏళ్ల కెరీర్ ముగించిన తమన్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు. గోపి చంద్ హీరోగా తెరకెక్కుతుం స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ మూవీలో తమన్నా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అందాధున్ హిందీ రీమేక్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా చిత్రాలు చేస్తున్నారు తమన్నా. 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్