చిరంజీవి రాజీ పడక తప్పదా..?

By AN TeluguFirst Published Aug 6, 2019, 12:04 PM IST
Highlights

'సై రా' లాంటి భారీ సినిమాలు ఎంతకాలం నిర్మాణంలో ఉన్నా కానీ ఫైనల్ గా వాటికి ఆకర్షణగా నిలిచేది మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ అనే చెప్పాలి. వీటిని ఎంత క్వాలిటీతో చేయించుకోగలిగితే అంతగా ప్రజాదారణ పొందుతాయి. 

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'సై రా'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండేళ్లపాటు నిర్మాణం జరుపుకొంది.

ఇలాంటి భారీ సినిమాలు ఎంతకాలం నిర్మాణంలో ఉన్నా కానీ ఫైనల్ గా వాటికి ఆకర్షణగా నిలిచేది మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ అనే చెప్పాలి. వీటిని ఎంత క్వాలిటీతో చేయించుకోగలిగితే అంతగా ప్రజాదారణ పొందుతాయి. ఈ విషయం సై రా టీమ్ కి కూడా తెలుసు.. గ్రాఫిక్స్ పై భారీగానే ఖర్చు పెట్టినా కానీ దర్శకుడు సురేందర్ కి ఇలాంటి సినిమా డీల్ చేసిన అనుభవం లేకపోవడంతో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్న స్థాయిలో రాలేదట. 

దాంతో వాటిని మార్చాలని భావిస్తున్నారు. కానీ దానికి చాలా సమయం పడుతుందని తేలడంతో క్వాలిటీ పరంగా రాజీ పడడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నవాటినే కాస్త మెరుగ్గా చేసి అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

చరణ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడంతో నిర్మాణ వ్యవహారాలు చిరంజీవి చూసుకుంటున్నారు. అక్టోబర్ 2 దాటితే సినిమాకి ఫ్రీ గ్రౌండ్ దొరకదని ఆ డేట్ మిస్ చేయడానికి వీలులేదని చిరు ఆదేశాలు జారీ చేశారట. అందుకే గ్రాఫిక్స్ కంటే సినిమాలో డ్రామాని నమ్ముకొని గాంధీ జయంతికే సినిమాను విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. 

click me!