ఈ వరస కష్టాల నుంచి అనసూయ బయటిపడేయగలదా?

By AN TeluguFirst Published Aug 6, 2019, 11:42 AM IST
Highlights

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా.. బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు.

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఆడాలంటే ..సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలనేది ఎంత నిజమో..జనాలని థియోటర్స్ దాకా రప్పించే సత్తా ఉన్న ఆర్టిస్ట్ సినిమాలో ఉండాలనేది అంతే నిజం. అదే సమయంలో మార్కెట్ లో సరైన సినిమా లేకపోతే ఇంకా అవసరం. అయితే ఇవన్ని చెప్పి కలిసిరావు. కలిసొచ్చే టైమ్ వచ్చినప్పుడే మనకు దారి క్లియర్ అవుతుంది. ఇదంతా ఎందుకు ఇప్పుడూ అంటే.. చాలా కాలం క్రితం మొదలై , ఫైనాన్సియల్ సమస్యలతో ఆగిపోయి ఎట్టకేలకు రిలీజ్ పెట్టుకున్న చిత్రం  ‘కథనం’.

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా.. బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.  అయితే అదే రోజున నాగార్జున తాజా చిత్రం మన్మధుడు 2 రిలీజ్ అవుతోంది.  నాగార్జున సినిమాకు ఇప్పటికే ఓ రేంజిలో ప్రమోషన్ చేయటంతో క్రేజ్ కూడా అదే స్దాయిలో క్రియేట్ అయ్యింది. 

‘కథనం’ విషయానికి వస్తే... ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అనసూయ ఒక్కర్తే సినిమాలో పేయింగ్ ఎలిమెంట్. దానికి తోడు నాగ్ సినిమాపై పోటీ ఉండటంతో థియోటర్స్ సైతం సరైనవి దొరకవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్స్ సైతం వీళ్లు చెప్పిన రేటుకు పెద్దగా ఉత్సాహం చూపలేదని తెలుస్తోంది. దాంతో చాలా ఏరియాలు సొంత రిలీజ్ పెడుతున్నట్లు వినికిడి. సినిమా కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ర్పెడ్ అయితే ఏ ఇబ్బంది లేదు. అలా కాకపోతేనే కష్టం. ఏం జరుగుతుందో మరో మూడు రోజులో తేలిపోనుంది. 

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది. మంచి డేట్, సెలవులు కలిసొస్తుండడం, విడుదలకు దగ్గర్లో మరో సరైన తేదీ లభించక ఆగస్టు 9న వస్తున్నాం. పెద్ద చిత్రంతో(మన్మథుడు 2) పోటీ పడాలని మాత్రం కాదు. అనసూయ నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి అభినందించడంతో సినిమాపై మాకు మరింత నమ్మకం ఉంది." అన్నారు.

click me!