
కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) పై అభిమానానన్ని మరో సారి చాటుకోబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్(NTR)..
పునిత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) కన్నడ పవర్ స్టార్. కోట్ల మంది మనసులను గెలుచుకున్న ఈ కన్నడ హీరో.. అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచి.. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 29న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దాంతో పునిత్ కోసం టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. తెలుగు స్టార్ హీరోలంతా పునిత్ కు ఘనంగా నివాళి అర్పించారు. స్వయంగా వెళ్లి పుతిన్ కు కడసారి చూసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్(NTR), నందమూరి బాలకృష్ణ ( Balakrishna) కు పునిత్ తో చాలా దగ్గర అనుబంధం ఉంది.
ఇక ఇప్పుడు పునిత్ కోసం మరోసారి టాలీవుడ్ స్టార్ హీరోలు కదలబోతున్నారు. పునిత్ రాజ్ కుమార్(Puneeth Raj Kumar) నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చ్ 17న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పునిత్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ చూసి.. ఒకవైపు బాధతో.. మరో వైపు తమ స్టార్ హీరో చివరి సినిమా చూడబోతున్నాం అన్న సంతోషంతో ఉన్నారు. అయితే కన్నడతో పాటు పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మార్చ్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చ్ 6న నిర్వహించాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్(NTR) లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించారని, దీనికి వీరిద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అఫీషయియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇంత వరకూ రాలేదు. వీరిద్దరు వెళ్తే కనుకు సినిమాకు భారీ ప్రమోషన్ తో పాటు తమ మిత్రుడి కోసం కదిలి వచ్చినందకు పునిత్ ఫ్యాన్స్ అభిమానాన్ని ఈ స్టార్స్ గెలుచుకున్నట్టే.