
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబర్ 150 సినిమాతో రికార్డులు బద్దలు కొడుతున్నారు. రికార్డు కలెక్షన్లతో అద్దరగొడుతున్న బాస్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక బాస్ రఫ్పాడించేస్తారని మెగా అభిమానులు స్పష్డంచేస్తున్నారు. అభిమానుల మాటల్ని నిజం చేస్తూ మెగాస్టార్ మరో సినిమాకు రెడీ అయ్యారు.
9 ఏళ్ల విరామం తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150 ఈ సంక్రాంతి రేసులో విజేత గా నిలవడమే కాకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 150 చిత్రంతో మెగా క్యాంప్ లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది . దాంతో తదుపరి సినిమాలకు రెడీ అవుతున్నాడు చిరంజీవి . భారీ సక్సెస్ ఇచ్చిన జోష్ చిరు ముఖంలో కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది . ఇక ఖైదీ నెంబర్ 150 చిత్రం రిలీజ్ కాకముందే లైన్లో రెండు మూడు కథలు పెట్టుకున్నాడు చిరు.
వాటిలో మళ్ళీ వివివినాయక్ , సురేందర్ రెడ్డి లతో సినిమాలు చేయనున్నాడు . అయితే ముందుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అది కూడా సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లోనే మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు . సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ నచ్చడంతో ఆ సినిమా పట్టాలెక్క నుంది . ఆ సినిమా కూడా మార్చిలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు చరణ్ .