చిరు టైటిల్ వాడేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్!

Published : Apr 04, 2019, 12:17 PM IST
చిరు టైటిల్ వాడేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'సీత' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'సీత' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కోలివుడ్ చిత్రం 'రాచ్చసన్' రీమేక్ సినిమాలో నటించడానికి అంతా సిద్ధం చేస్తున్నాడు.

తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను బెల్లంకొండ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అరవై శాతం షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.  ఈ సినిమాకి 'రాక్షసుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. 'రాక్షసుడు' అనగానే చిరంజీవి సినిమా గుర్తొస్తుంది.

ఆ తరువాత సూర్య ఆ టైటిల్ వాడుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమా కోసం వాడుకుంటున్నాడు. శనివారం నాడు ఉగాది పండగ కానుకగా సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు. 

సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?