అభిమాని కోరికను నెరవేర్చిన చిరంజీవి!

Published : Apr 22, 2019, 02:19 PM IST
అభిమాని కోరికను నెరవేర్చిన చిరంజీవి!

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం, మందపల్లి గ్రామానికి చెందిన  మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని శ్రీ నక్కా వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుండి శ్రీ చిరంజీవి గారిని ప్రగాఢంగా ప్రేమిస్తూ వున్నాడు. 

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం , మందపల్లి గ్రామానికి చెందిన  మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని శ్రీ నక్కా వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుండి శ్రీ చిరంజీవి గారిని ప్రగాఢంగా ప్రేమిస్తూ వున్నాడు. 

ప్రజారాజ్యం సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయగా ఆ గ్రామంలో ఇతన్ని 5 సంవత్సరాల కాలం రాజకీయం గా  వెలివేయడం జరిగింది.ఆ విషయం తెలిసిన శ్రీ చిరంజీవి గారు అప్పట్లో ఇంటికి పిలిపించికొని  రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి కుటుంబం అందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది.

గత సంవత్సరం ఇదే నెలలో శ్రీ వెంకటేశ్వర రావుకు బాబు పుట్టడం  జరిగింది .అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అన్నాడు. 
 ఆ విషయాన్ని శ్రీ చిరంజీవి గారు తెలుసుకొని ఈ రోజు కుటంబ సభ్యులు అందరిని ఇంటికి పిలిపించుకొని ఆ చిన్నారికి  పవన్ శంకర్ అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు. 

ఇక  శ్రీ నక్కా వెంకటేశ్వర రావు కుటుంభ సభ్యులుకు  ఆనందానికి అవదలు లేవు .
-- అఖిల భారత చిరంజీవి యువత.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?