బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్న మెగాస్టార్‌ చిరంజీవి

Published : Jan 17, 2021, 07:38 AM IST
బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్న మెగాస్టార్‌ చిరంజీవి

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు `లూసిఫర్‌` రీమేక్‌, `వేదాళం` రీమేక్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

రీఎంట్రీ తర్వాత అన్నా తమ్ముళ్ల దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూనే ఐదారు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే మూడు సినిమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అన్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

మరోవైపు `లూసిఫర్‌` రీమేక్‌, `వేదాళం` రీమేక్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిలో మొదట `లూసిఫర్‌` రీమేక్‌ చిత్రంలో నటించనున్నారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా ప్రారంభమయ్యే డేట్‌ని ఫిక్స్ చేశారట. ఈ నెల 21న గ్రాండ్‌గా ఓపెనింగ్‌ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓపెనింగ్‌ చేసిన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తుంది. దాదాపు నెలరోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిపి, ఆ తర్వాత `వేదాళం` రీమేక్‌ని స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?