పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్’లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్‌నీల్ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం విధితమే.
ప్రభాస్ ‘సలార్’ మొదలై...ఫ్యాన్స్ కు పండగ చేసింది. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు ఇది నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్. ‘కె.జి.ఎఫ్’తో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగందూర్ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి కలయికలో రూపొందనున్న మరో పాన్ ఇండియా చిత్రమే... ‘సలార్’. శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పడు రిలీజ్ కానుందనేది చర్చగా మారింది.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చెయ్యాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. భారీ చిత్రమైనా చక్కటి ప్లానింగ్ తో స్పీడుగా ఈ సినిమాని ఫినిష్ చేయాలనేది డైరక్టర్ ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ కు ఇచ్చిన మాట అని తెలుస్తోంది. అలా స్పీడుగా పూర్తి చేస్తారనే వెంటనే డేట్స్ ఇచ్చారని చెప్తున్నారు. దసరా రిలీజ్ అని విన్న వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా దసరా కు వస్తే ప్రభాస్ సినిమాల్లో ఇది ప్రత్యేకమైన రికార్డే అంటున్నారు.
ఇక ఈ చిత్రం లాంచింగ్ కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, హీరో యశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినీ ప్రముఖులు దిల్‌రాజు, డి.వి.వి.దానయ్య, నవీన్ ఎర్నేని, సాయి కొర్రపాటి హాజరై చిత్ర టీమ్ కి అభినందనలు తెలిపారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ‘‘నాకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్‌కీ, ప్రభాస్‌కీ ధన్యవాదాలు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో యశ్ మాతో ఉండటం మరింత ఆనందాన్నిచ్చింది. ‘సలార్’ ప్రేక్షకుల్ని నిరాశ పరచదు’’ అన్నారు.
“కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు. “కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టేసారట. అలాగే ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో తొలినుంచి పనిచేస్తున్నవారే ఉంటారని చెప్తున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్ వయోలెంట్ మ్యాన్.. కాల్డ్ వన్ మ్యాన్... ది మోస్ట్ వయోలెంట్.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు. హొంబెల్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2ను నిర్మించిన విజయ్ కిరుగందుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.