బాలకృష్ణ సినిమా పెద్ద హిట్‌ కావాలి.. చిరంజీవి కామెంట్.. శృతి హాసన్‌పై ఫన్నీ సెటైర్లు

Published : Jan 08, 2023, 11:27 PM IST
బాలకృష్ణ సినిమా పెద్ద హిట్‌ కావాలి.. చిరంజీవి కామెంట్.. శృతి హాసన్‌పై ఫన్నీ సెటైర్లు

సారాంశం

సంక్రాంతి రిలీజ్‌ చేయబోయే రెండు సినిమాలు అటు వీరసింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య ఈ రెండు పెద్ద విజయం సాధించాలని ఈ వైజాగ్‌ సాక్షిగా కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు. 

మెగాస్టార్‌ చిరంజీవి వైజాగ్‌లో జరిగిన`వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ సినిమాకి అభినందనలు తెలిపారు. బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` కూడా ఈ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాతలు, `వాల్తేర్‌ వీరయ్య` నిర్మాతలు ఒక్కరే. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ కి అభినందనలు తెలిపారు చిరు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి అరుదైన సంఘటన ఎప్పుడూ జరగలేదని, ఒకే నిర్మాతకు చెందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం అరుదైన విషయం అన్నారు. ఇది అనుకుని జరిగిందో, అనుకోకుండా జరిగిందో తెలియదుగానీ ఇదొక అరుదైన విషయమన్నారు. 

రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్‌ అవుతున్నా, అదరడం లేదు, బెదరడం లేదు, ఏంటి వీళ్ల దైర్యమంటే ఆ సినిమాల సబ్జెక్ట్ అని అర్థమైంది. కచ్చితంగా ఆడియెన్స్ రెండు సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం. వాళ్లు బాగుండాలి, తద్వారా పరిశ్రమ బాగుంటుంది.వాళ్లు సంక్రాంతి రిలీజ్‌ చేయబోయే రెండు సినిమాలు అటు వీరసింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య ఈ రెండు పెద్ద విజయం సాధించాలని ఈ వైజాగ్‌ సాక్షిగా కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు. ఈ నిర్మాతలను చూసి చాలా మంది కుళ్లుకునే పరిస్థితి వస్తుందన్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్రేని, రవిశంకర్, చెర్రిలకు ఆయన విషెస్‌ చెబుతూ, నిర్మాతలుగా వాళ్లకున్న డెడికేషన్‌, నిబద్దత, డేర్‌ నెస్‌ని చిరు ప్రశంసించారు. సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేస్తారని, రామానాయుడు లాంటి పెద్ద నిర్మాతలుగా ఎదుగుతారని చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ శృతి హాసన్‌పై సెటైర్లు పేల్చారు. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. `వీరసింహారెడ్డి`లోనూ ఆమెనే హీరోయిన్‌. మొన్న(డిసెంబర్‌ 6)న ఒంగోల్‌లో `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అందులో బాలయ్యతోపాటు శృతి కూడా పాల్గొంది. 

అయితే శృతి హాసన్‌ `వాల్గేర్‌ వీరయ్య` ఈవెంట్‌కి చివరి నిమిషంలో డ్రాప్‌ అయ్యింది. ఆమెకి జ్వరం వచ్చిందని చెప్పారు చిరంజీవి. మొన్న ఈవెంట్‌లో ఏం తిన్నదో ఏంటో, పాప ఆరోగ్యం బాగా లేదని చెప్పిందని కాస్త నలతగా అనిపిస్తుందని కోవిడ్‌ టెస్ట్ చేయించుకుంటున్నట్టు తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని అన్నారు. అయితే సినిమాలో ఆమె గ్లామర్‌ పరంగానే కాదు, నటన, యాక్షన్‌తోనూ అదరగొట్టిందని చెప్పారు. ఫారెన్‌లో వణికే చలిలోనూ వణుకుతూ డాన్సు చేసిందన్నారు. అది తన ప్రొఫెషనలిజం అని తెలిపింది. ఈ సందర్భంగా ఆమెకి అభినందనలు తెలిపారు చిరంజీవి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..