
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుండడంతో.. చిరు వైజాగ్ గొప్పతనం వివరించారు. విశాఖలో విశాలమైన మనసు ఉన్న ప్రజలు ఉంటారు. ఈ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ సెటిల్ కావాలని కోరుకుంటారు. నాకు కూడా అలాంటి చిరకాల కోరిక ఉంది. అందుకే ఈ మధ్యనే విశాఖలో స్థలం కొన్నాను. ఇల్లు కట్టాల.. విశాఖ పౌరుడు కావాలనే కోరిక ఉంది. ఇక్కడ ప్రజల్లో కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఎంతో సరదాగా ఉంటారు అని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ చిత్రాన్ని గంటన్నర సిట్టింగ్ లోనే ఓకే చేశానని చిరు అన్నారు. అలా నేను ఒకే చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయని మెగాస్టార్ అన్నారు.