చిరంజీవి సంక్రాంతి ట్రీట్‌.. `విశ్వంభర`టైటిల్‌ ఫస్ట్ లుక్‌, రిలీజ్‌ డేట్‌?

Published : Jan 14, 2024, 02:17 PM ISTUpdated : Jan 14, 2024, 03:11 PM IST
చిరంజీవి సంక్రాంతి ట్రీట్‌.. `విశ్వంభర`టైటిల్‌ ఫస్ట్ లుక్‌, రిలీజ్‌ డేట్‌?

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు తన 156వ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి సంక్రాంతి అప్‌ డేట్‌ రాబోతుంది. అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వబోతున్నారు చిరు.

మెగాస్టార్‌ చిరంజీవి `భోళాశంకర్‌` వంటి డిజాస్టర్‌ తర్వాత ఇప్పుడు స్ట్రెయిట్‌ కంటెంట్‌తో వస్తున్నారు. ఆయన ప్రస్తుతం `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. మైథలాజికల్‌ అంశాలను ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. చిరంజీవి లేని సీన్లని తెరకెక్కిస్తున్నారు. 

ఈ నెలాఖరులో చిరంజీవి షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చిరంజీవి నటిస్తున్న 156 మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ రాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. టైటిల్‌ని ప్రకటించడంతోపాటు ఫస్ట్ లుక్‌ ఇవ్వబోతున్నారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ని కూడా లాక్‌ చేయబోతున్నారట. సాయంత్రం ఐదు గంటలకు టైటిల్‌ ని ప్రకటిస్తామని టీమ్‌ తాజాగా వెల్లడించడం విశేషం. 

రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ ఫస్ట్ లుక్‌ రాబోతుందట. దీనికి `విశ్వంభర` అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. గతేడాది సంక్రాంతికి చిరంజీవికి బాగా వర్కౌట్‌ అయ్యింది. ఆయన నటించిన `వాల్తేర్‌ వీరయ్య` రెండు వందల యాభై కోట్లు చేసింది. చిరంజీవి కెరీర్‌లోనే పెద్ద హిట్ మూవీ. అది కేవలం సంక్రాంతికి రావడం వల్లే సాధ్యమైంది. 

ఇప్పుడు సంక్రాంతి వచ్చిన చిత్రాలు కూడా టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు వస్తున్నాయంటే పండగే కారణం. అందుకే చాలా మంది హీరోలు సంక్రాంతిని టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌ కూడా అదే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌ అని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?