
చిరంజీవి 151వ సినిమాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి లుక్ ను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు సురేందర్ రెడ్డి వున్నారు. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ఓ వీర యోధుడి కథ ఇది. ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి గాను , రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో భారీ సెట్ ను వేయిస్తున్నారు.
100 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించాలని రామ్ చరణ్ భావించాడు. అయితే మరో 25 కోట్లను అదనంగా ఖర్చు చేయడానికి ఆయన సిద్ధమైనట్టు చెబుతున్నారు. 'బాహుబలి 2' సినిమాలో యుద్ధ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. భారీ ఖర్చుతో ఆశ్చర్య చకితులను చేసే విధంగా గ్రాఫిక్స్ చేయించారు. మున్ముందు రానున్న సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు ఆ స్థాయిలో లేకపోతే ప్రేక్షకులు పెదవి విరుస్తారు. అందువల్లనే చరణ్ గ్రాఫిక్స్ కోసం మరింత ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట.