
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. చిరంజీవి సినిమా ఫైట్ మాస్టర్ కన్నుమూశారు. చిరంజీవి హీరోగా నటించిన `అన్నయ్య` చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన జాలి బాస్టియన్ హార్ట్ ఎటాక్‌తో తుదిశ్వాస విడిచారు. బెంగుళూరులోని తన నివాసంలో జాలి బాస్టియన్ గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఆయన కన్నడలో ఫైట్ మాస్టర్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడతోపాటు తెలుగులో, తమిళం, మలయాళంలోనూ ఆయన 900లకుపైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా, అలాగే హీరోలకు డూప్‌గానూ చేశారు.
జాలి బాస్టియన్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జాలి బాస్టియన్.. 24 సెప్టెంబరు 1966న కేరళాలోని అలెప్పీలో జన్మించారు. ఆయన ఎక్కువగా బెంగళూరులో పెరిగాడు. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆయన్ని యాక్షన్ వైపు నడిపించింది, అలా ఫైట్ మాస్టర్ని చేసింది. ప్రారంభంలో పెద్ద హీరోల కోసం బైక్, కారు ఛేజింగ్‌లో డూప్‌గానూ చేశారు. 300 సినిమాలకు పైగా హై రిస్క్ బ్లాస్ట్ సీక్వెన్స్ చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జాలీ బాస్టియన్.
మరోవైపు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత తనే సొంతంగా ఫైట్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఫైట్ మాస్టర్‌గా అనేక సినిమాలకు పని చేశారు. తనదైన యాక్షన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫైట్స్ లో తన మార్క్ ని చూపించారు. కన్నడ, మలయాళం, తమిళంలో ఎక్కువగా సినిమాలు చేశారు. తెలుగులోనూ అడపాదడపా ఆయన ఫైట్స్ మాస్టర్‌గా చేశారు. అలా మెగా స్టార్ చిరంజీవి నటించిన `అన్నయ్య` సినిమాలో స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఆ తర్వాత `నక్షత్రం` మూవీ కి స్టంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు.
జాలి బాస్టియన్.. ఫైట్ మాస్టర్‌గానే కాదు, దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `నినగాగి కాడిరువే` అనే చిత్రాన్నిరూపొందించారు. కానీ ఇది పెద్దగా ఆడలేదు. కానీ పేరుతెచ్చింది. ఈ సినిమా కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ సక్సెస్ కాలేదు. ఇక ఆయనలో సింగర్ కూడా ఉన్నాడు. ఆర్కేస్టాలో పాడుతుంటాడు.