మెగాస్టార్‌ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ పోస్ట్ లు నెట్టింట వైరల్‌.. ఏం జరగబోతుంది?

Published : Mar 07, 2022, 04:51 PM IST
మెగాస్టార్‌ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ పోస్ట్ లు నెట్టింట వైరల్‌.. ఏం జరగబోతుంది?

సారాంశం

కళ్యాణ్ దేవ్‌ పెట్టే పోస్ట్ లు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడానికి మరో కారణం ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజని కళ్యాణ్‌ దేవ్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌.. తెలుగులో హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన `సూపర్‌ మచ్చి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. పైగా ప్రమోషన్‌కి కూడా హీరో లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌.  ఇదిలా ఉంటే ఆయన నటించిన మరో సినిమా `కిన్నెరసాని` విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హీరో కళ్యాణ్‌ దేవ్‌ చేస్తున్న పోస్ట్ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ఆ మధ్య తన కొత్త లుక్ ని పంచుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టారు. ఇతరులు చెప్పేది పట్టించుకోకని, అది జస్ట్ విని వదిలేయాలని, నీకు నచ్చింది చెయ్‌ అంటూ కామెంట్‌ పెట్టారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ ని పంచుకున్నారు. తన నయా ఫోటో షేర్‌ చే్సతూ, `శనివారం నుంచి సోమవారం మధ్యలో` అంటూ కామెంట్‌ పెట్టాడు. అంతే వీకెండ్‌లో ఎలా గడిపారనే విషయాన్ని ఇలా పంచుకున్నాడు కళ్యాణ్‌ దేవ్‌. ఇలా తనలోని ఫీలింగ్స్ ని ఫోటోల రూపంలో షేర్‌ చేసుకుంటూ ఆసక్తికర కామెంట్లు పెట్టడం వైరల్‌గా మారుతుంది. 

అయితే కళ్యాణ్ దేవ్‌ పెట్టే పోస్ట్ లు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడానికి మరో కారణం ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజని కళ్యాణ్‌ దేవ్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో సెటిల్‌ అయిన ఫ్యామిలీకి చెందిన కళ్యాణ్‌ దేవ్‌.. మ్యారేజ్‌ తర్వాత హీరోగా మారాడు. `విజేత` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి హీరోగా పరిచయం అయ్యారు ఆ సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్నారు. కారణం చిరంజీవి, మెగాఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్లే. కానీ ఇటీవల శ్రీజతో మనస్పార్థాలొచ్చినట్టు వార్తలొచ్చాయి. 

ఆ మధ్య శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి భర్తపేరైనా కళ్యాణ్‌ ని తీసేసింది. శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. ఇదే అనేక అనుమానాలకు తావిచ్చింది. అంతకు ముందే వీరిద్దరి మధ్య విభేధాలు వచ్చాయనే పుకార్లు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి. దానికి బలం చేకూరేలా శ్రీజ.. భర్త పేరుని తొలగించడం పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో విడిపోవడానికి ముందు సమంత కూడా ఇలా అక్కినేని అనే పేరుని తొలగించింది. ఆ తర్వాత ఊహించినట్టుగానే విడాకులు ప్రకటించారు. దీంతో శ్రీజ విషయంలోనే అదే జరగబోతుందనే అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌ సైతం అలాంటి పర్సనల్‌ పోస్ట్ లు పెట్టడం మరింత ఆసక్తిగా, వైరల్‌గా మారుతున్నాయి. ఏం జరగబోతుందనే సస్పెన్స్ నెలకొంటుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా