
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ స్పందించారు. తన తాజా చిత్రం రాధే శ్యామ్ సినిమా విడుదలకు ముందే టికెట్ల ధరలపై ప్రభుత్వం జీవో ఇస్తే సంతోషిస్తానని చెప్పారు. ఇక, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని.. భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పటికే ఈ విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
ఇక, గత నెలలో సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖల బృందంలో ప్రభాస్ కూడా ఉన్నారు. సీఎం జగన్‌తో భేటీ అయినవారిలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని కృష్ణమురళి, ఆలీ, ఆర్ నారయణ మూర్తి ఉన్నారు. అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే శుభవార్త ఉంటుందని చెప్పారు.