Radhe Shyam: జాతకాలపై ఇంట్రెస్ట్ లేదు, రాధే శ్యామ్ కి నో చెబుదామనే అనుకున్నా: ప్రభాస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 07, 2022, 04:02 PM IST
Radhe Shyam: జాతకాలపై ఇంట్రెస్ట్ లేదు, రాధే శ్యామ్ కి నో చెబుదామనే అనుకున్నా: ప్రభాస్

సారాంశం

మరో మూడు రోజుల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఈ చిత్రానికి సంబంధించిన అనుభవాలు షేర్ చేసుకున్నాడు.  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఊహించని క్రేజ్ నడుమ రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. 

మరో మూడు రోజుల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఈ చిత్రానికి సంబంధించిన అనుభవాలు షేర్ చేసుకున్నాడు.  జాతకాలు, చేయి చూసి భవిష్యత్తు చెప్పడం వీటిని నేను అంతగా నమ్మను. ఆసక్తి కూడా లేదు. 

రాధాకృష్ణ మీకు ఓ లవ్ స్టోరీ చేబుతాడట అని వంశీ ప్రమోద్ చెప్పారు. సరే రమ్మను అని చెప్పాను. ఆ తర్వాత ఇది పామిస్ట్ కి సంబందించిన కథ అని అన్నారు. లవ్ స్టోరీ అన్నారు.. మళ్ళీ ఇప్పుడు పామిస్ట్ అంటున్నారు అని మనసులో అనుకున్నాను. 

ఇంతదూరం వచ్చాడు కదా.. ఇంటర్వెల్ వరకు కథ విని నో చెప్పేద్దాం అని అనుకున్నా. ఇంటర్వెల్ వరకు వున్న తర్వాత ఇదేదో బావుందే అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా విని నిర్ణయం తీసుకుందాం అని అనుకున్నా. సెకండ్ హాఫ్ వింటుంటే కథలో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయా అని ప్రభాస్ తెలిపాడు. 

ఇక ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు గారి గురించి మాట్లాడుతూ.. ఇది లవ్ స్టోరీ.. పెదనాన్నతో మాట్లాడాలంటే అందరూ భపడేవాళ్లు. కానీ పెదనాన్న ఒక కుర్రాడిలా మారి అద్భుతమైన సలహాలు ఈ చిత్రాన్ని ఇచ్చారు. డబ్బు గురించి ఆలోచించొద్దు.. సినిమా బాగారావాలి అనేవారు. నా వైపు నుంచి కూడా పెదనాన్నకు ఓ పెద్ద హిట్ ఇవ్వాలని అనుకుంటున్నా. అది రాధే శ్యామ్ తో నెరవేరుతుంది అని ప్రభాస్ తెలిపాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా