దేవిశ్రీ ప్రసాద్‌, కృతి శెట్టిలకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ పంపిన చిరంజీవి

Published : Feb 22, 2021, 08:34 AM IST
దేవిశ్రీ ప్రసాద్‌, కృతి శెట్టిలకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ పంపిన చిరంజీవి

సారాంశం

`ఉప్పెన` సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, హీరోయిన్‌ కృతి శెట్టిలని మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. గిఫ్ట్స్, గ్రీటింగ్‌లతో సర్‌ప్రైజ్‌  చేశారు. దేవిశ్రీకి గిఫ్ట్స్ పంపించడంతోపాటు ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ని పంపారు చిరంజీవి. 

`ఉప్పెన` సినిమా ఈ ఏడాది భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరు చెప్పినట్టుగానే సినిమా రికార్డ్ సృష్టించింది. ఓ డెబ్యూ హీరోగా సినిమా ఆరవై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం నిజంగానే రికార్డ్. కొత్త తరహా ఎండింగ్‌తో సినిమా ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, బుచ్చిబాబుసాన దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా ఈ రేంజ్‌ విజయం సాధించడంతో అంతా చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఈ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, హీరోయిన్‌ కృతి శెట్టిలని మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. గిఫ్ట్స్, గ్రీటింగ్‌లతో సర్‌ప్రైజ్‌  చేశారు. దేవిశ్రీకి గిఫ్ట్స్ పంపించడంతోపాటు ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ని పంపారు చిరంజీవి. ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావో, చిత్రం రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్కి అంతే ప్యాషన్‌తో మ్యూజిక్‌నిస్తావ్‌. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్‌ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా` అని తెలిపారు చిరంజీవి. ఈ సందర్బంగా చిరంజీవి బిగ్‌ థ్యాంక్స్ చెప్పారు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

మరోవైపు తన చూపులతో, ఎక్స్ ప్రెషన్స్ తో, అద్భుతమైన నటనతో ఫిదా చేసి కలల రాణిలా మారిన కృతి శెట్టిని సైతం చిరంజీవి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ మేరకు ఆమెకి ఓ లెటర్‌ని పంపించాడు. ఇందులో కృతి శెట్టిన అందాన్ని, నటనని చిరంజీవి ప్రశంసించారు. తనని స్టార్‌ పుట్టావని, తెరపై అద్భుతమైన అప్పియరెన్స్ తో ఫిదా చేశావని, తాను స్టార్‌గా నిరూపించుకోవడమే కాదు, అమేజింగ్‌ ఆర్టిస్టుగా నిరూపించుకున్నావన్నారు. కొద్ది రోజుల్లోనే తెలుగు లాంగ్వేజ్‌ నేర్చుకుని అద్భుతంగా ప్రజెంట్‌ చేయగలిగావన్నారు. నీ నటనే నువ్వు వండర్‌ కిడ్‌ అని నిరూపించిందన్నారు. `ఉప్పెన` సక్సెస్‌లో భాగమైన తనని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు చిరంజీవి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?