ఈసారి చిరు టైటిల్ వాడేస్తున్నాడు!

Published : Aug 28, 2018, 04:32 PM ISTUpdated : Sep 09, 2018, 11:39 AM IST
ఈసారి చిరు టైటిల్ వాడేస్తున్నాడు!

సారాంశం

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చక్కటి కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. మధ్యలో ఫ్లాప్ వచ్చినప్పటికీ మళ్లీ పుంజుకొని 'ఫిదా','తొలిప్రేమ' వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చక్కటి కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. మధ్యలో ఫ్లాప్ వచ్చినప్పటికీ మళ్లీ పుంజుకొని 'ఫిదా','తొలిప్రేమ' వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా టైటిల్ ను తన సినిమాకు పెట్టుకొని విజయం అందుకున్న వరుణ్ ఇప్పుడు పెదనాన్న చిరంజీవి టైటిల్ పై కన్నేశాడు.

అదే 'హీరో'. చిరు గతంలో 'హీరో' అనే సినిమాలో నటించారు. ఆ తరువాత అదే టైటిల్ ని నితిన్ తన సినిమాకు వాడుకున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది. త్రినాధరావు నక్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తోన్న 'అంతరిక్షం' సినిమాలో నటిస్తున్నారు.

అలానే వెంకటేష్ తో కలిసి నటిస్తోన్న 'ఎఫ్2' సినిమా సెట్స్ పై ఉంది. ఈ రెండు పూర్తయిన తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేయనున్నాడు. ఇవి కాకుండా సాగర్ చంద్ర డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 

ఇది కూడా చదవండి.. 

'హీరో' ఈ టైటిల్ ఎవరికోసం..?

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ