కొరటాల ప్రపోజల్ కు 'నో' చెప్పిన చిరు

By Surya PrakashFirst Published Aug 20, 2020, 8:13 AM IST
Highlights

ఈ విషయమై చిరంజీవి అభ్యంతరపెట్టారట. ఇప్పుడు టీజర్ లాంటివి పెట్టుకోవద్దని, ఎదర చాలా అకేషన్స్ ఉన్నాయని, అప్పుడు మెల్లిగా రిలీజ్ చేద్దామని అన్నారట. ఇప్పుడే మనం ప్రమోషన్ మొదలెడితే...కరెక్ట్ గా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ సమయానికి పెద్దగా చేయటానికి ఉండదని అభిప్రాయపడ్డారట. అప్పటికీ కొరటాల చిన్న టీజరే కదా అని ఒప్పించే ప్రయత్నం చేసారట. చిరు మొహమాటం లేకుండా నో చెప్పేసారని సమాచారం. 

ఈ వారంలో అభిమానులు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని చోట్లా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఉత్సవాలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో చిరంజీవితో ఆచార్య చిత్రం చేస్తున్న కొరటాల శివ...ఓ టీజర్ ని వదులుదామని ప్లాన్ చేసారు. అందుకోసం ఓ చిన్న డైలాగ్ ని కట్ చేసి రఫ్ వెర్షన్ ని చిరంజీవికు పంపారట. ఈ టీజర్ తో ఆయన ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్నారు. 

ఈ విషయమై చిరంజీవి అభ్యంతరపెట్టారట. ఇప్పుడు టీజర్ లాంటివి పెట్టుకోవద్దని, ఎదర చాలా అకేషన్స్ ఉన్నాయని, అప్పుడు మెల్లిగా రిలీజ్ చేద్దామని అన్నారట. ఇప్పుడే మనం ప్రమోషన్ మొదలెడితే...కరెక్ట్ గా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ సమయానికి పెద్దగా చేయటానికి ఉండదని అభిప్రాయపడ్డారట. అప్పటికీ కొరటాల చిన్న టీజరే కదా అని ఒప్పించే ప్రయత్నం చేసారట. చిరు మొహమాటం లేకుండా నో చెప్పేసారని సమాచారం. 

ప్రస్తుతానికి ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. అభిమానులంతా ఆశించినట్లుగానే ఆగస్టు 22న మెగాస్టార్ బర్తడే సందర్భంగా ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌ గా ఉంది. 

చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారని మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ పోస్టర్లో పిడికిలి బిగించిన చిరంజీవి చేయి, ఆ చేతికి చుట్టిన రెడ్ కలర్ క్లాత్ రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. ఓ సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ అనుకోకుండా ‘ఆచార్య’ అని చెప్పారు తప్ప టైటిల్‌ ని ఇంతవరకు అఫీషియల్‌ గా ప్రకటించలేదు.

 దీంతో ‘ఆచార్య’ టైటిల్‌ నే కన్‌‌ఫర్మ్ చేశారా లేక మరో టైటిల్ రిలీజ్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్‌ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

click me!