
చిరంజీవి, రవితేజ కలిసి `వాల్తేర్ వీరయ్య`లో నటించారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 13న విడుదలైంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. అయితే ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో కనిపించారు. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సెకండాఫ్‌లో ఆయన పాత్ర వస్తుంది. రవితేజ పాత్ర వల్లే ఈ చిత్రంలో సెకండాఫ్ నిలబడిందని చెప్పొచ్చు. అదే లేకపోతే సినిమానే లేదు.
లేటెస్ట్ గా శనివారం ఈ సినిమాకి సంబంధించిన బ్లాక్ బస్టర్ `వాల్తేర్ వీరయ్య` పేరుతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ అందరికి కంగ్రాట్స్ చెప్పారు. తనదైన స్టయిల్‌లో నవ్వులు పూయించార. చిరంజీవి గురుంచి మాట్లాడుతూ, అన్నయ్యతో గతంలో రెండు సినిమాలు చేశాను, కానీ అవి వేరు, ఇది వేరు. దీని గోల వేరే. ఇది కాదు కానీ ఇద్దరం కలిసి ఓ ఫుల్‌లెంన్త్ ఎంటర్‌టైనర్ సినిమా ఒకటి చేయాలి. గోల గోల గోల.. మొదట్నుంచి ఆఖరు దాక ఓరి బాబోయ్ చచ్చిపోతున్నామని ఆడియెన్స్ ఫీలయ్యేలా ఓ సినిమా చేయాలని ఉంది. ఆ దెబ్బకి థియేటర్లంతా ఊగిపోవాల`ని చెప్పారు రవితేజ. ప్రాపర్ ఎంటర్ టైనింగ్ మూవీ చేయమని దర్శకుడు బాబీకి చెప్పడం విశేషం. దీంతో యూనిట్ మొత్తం హోరెత్తించింది.
గతంలో చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ `ఆజ్‌కా గుండా రాజ్`, తెలుగు మూవీ `అన్నయ్య`లో కీలక పాత్రల్లో రవితేజ మెరిసారు. ఇప్పుడు `వాల్తేర్ వీరయ్య`లో సెకండ్ హీరోగా ఆ రేంజ్ పవర్ ఉన్న పాత్రలో కనిపించారు రవితేజ. సెకండాఫ్‌లో సినిమాకి ప్రాణం పోశారు. సెంటిమెంట్, ఎమోషన్స్ తో పిండేశాడు. అయితే కామెడీకి పెట్టింది పేరు చిరంజీవి, ఇక రవితేజ కామెడీ గోల ఏం రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. `వాల్తేర్ వీరయ్య`లో సెకండాఫ్‌లో అది చూడొచ్చు. అదే ఇద్దరు కలిసి ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ మూవీ చేస్తే ఆ రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు.
ఇక `వాల్తేర్ వీరయ్య` సినిమా శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ ని రాబట్టిందని తెలుస్తుంది. ఇది సుమార రూ.49కోట్లు వసూలు చేసిందట. సెకండ్ రోజు కూడా అదే రేంజ్‌లో సాగిందని అంటున్నారు. అయితే బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` రెండు రోజుల్లో వంద కోట్లకు చేరువలో ఉందని, కానీ క్రమంగా అది పడిపోతుందని ట్రేడ్ వర్గాల టాక్. `వాల్తేర్ వీరయ్య` ఎంటర్టైనింగ్‌గా ఉండటం కలిసొచ్చిందని సమాచారం.