Keerthy Suresh:`రివాల్వర్ రీటా`గా కీర్తిసురేష్‌.. ఫస్ట్ లుక్‌ అదిరిపోలా!

Published : Jan 15, 2023, 08:34 AM ISTUpdated : Jan 15, 2023, 08:35 AM IST
Keerthy Suresh:`రివాల్వర్ రీటా`గా కీర్తిసురేష్‌.. ఫస్ట్ లుక్‌ అదిరిపోలా!

సారాంశం

తెలుగు తెర మహానటి కీర్తి సురేష్‌ మరో క్రేజీ మూవీతో రాబోతుంది. `రివాల్వర్‌ రీటా` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ తాజాగా విడుదలైంది.

కీర్తిసురేష్‌కి టాలెంట్‌ ఉన్న, కాలం కలిసి రావడం లేదు. అదృష్టం వరించడం లేదు. ఈ బ్యూటీకి వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. `మహానటి`తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ అయిపోయిన కీర్తిసురేష్‌ ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే దక్కించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన ఏ ఒక్క మూవీ కూడా హిట్‌ కాలేదు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, స్టార్‌ హీరోలతో చేసిన చిత్రాలు ఇలా అన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మహేష్‌బాబు కూడా ఆమెని సేవ్‌ చేయలేకపోయాడు. 

వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్న కీర్తిసురేష్‌ ఇప్పుడు మరో ప్రయోగం చేస్తుంది. మరో వింటేజ్‌ కథతో రాబోతుంది. `రివాల్వర్‌ రీటా` పేరుతో రూపొందుతున్న చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని శనివారం విడుదల చేశారు. సమంత ఈ ఫస్ట్ లుక్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఈ `రివాల్వర్‌ రీటా` ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని సీరియల్ లుక్‌లో ఉంది కీర్తిసురేష్‌. 

సినిమా రియలిస్టిక్‌ అండ్‌ వింటేజ్‌ కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పూర్తి కామెడీ జోనర్‌ అని ఫస్ట్ లుక్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ చిత్రానికి కె చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ది రూట్, ప్యాషన్‌ స్టూడియో పతాకాలపై జగదీష్‌ నిర్మిస్తున్నారు. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీ(నెట్‌ ఫ్లిక్స్)లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం కీర్తిసురేష్‌ ఈ చిత్రంతోపాటు తెలుగులో నానితో పాన్‌ ఇండియా మూవీ `దసరా` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు చిరంజీవికి చెల్లిగా `భోళా శంకర్‌`లో నటిస్తుంది. అలాగే తమిళఃలో `మామన్నన్‌`, `సిరెన్‌`, `రఘు తాతా` చిత్రాలు చేస్తుంది. నటిగా బిజీగా ఉన్నా, సక్సెస్‌ మాత్రమే ఈ అమ్మడికి ఆమడ దూరం పారిపోతున్నాయి. `దసరా`పై బోలెడు ఆశలు పెట్టుకుంది కీర్తిసురేష్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?