బర్త్ డే వేళ చిరుకు మనశ్శాంతి కరువు..!

By Satish ReddyFirst Published Aug 21, 2020, 1:44 PM IST
Highlights

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకమైన తన 65వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఐతే ఈసారి పుట్టినరోజు పట్ల చిరంజీవి ఆసక్తిగా లేరట. ఆయన మనసు వేడుకల పైకి మళ్లడం లేదట. దాని కారణం తన సన్నిహితుడు ఎస్పీ బాలు ఆరోగ్యం అని తెలుస్తుంది.

దశాబ్దాల తెలుగు చిత్ర పరిశ్రమలో మూడొంతుల కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలతోనే నడించింది. 80-90లలో సినిమా పాటంటే అది బాలు స్వరం నుండి వచ్చినదే అన్నంతగా ఆయన తన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రపంచాన్నీ ఏలారు. హీరో వాయిస్ కి తగ్గట్టుగా పాటను పాడగల ఏకైన సింగర్ దేశంలో బాలు ఒక్కరే. దేశంలోని అన్ని భాషలలో వేల పాటలు బాలు పాడారు. ఐతే ఆయన గాత్రానికి తాతాల్కికంగా బ్రేక్ పడింది. బాలుగారు ప్రాణాంతక కరోనా వైరస్ తో అలుపెరని పోరాటం చేస్తున్నారు. 

ఆయన ఆరోగ్యంపై దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందినవారు, ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ మరియు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. బాలును ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకునే చిరంజీవి ఆయన ఆరోగ్యం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బాలు కోలుకోవాలని ఆయన కాంక్షించారు. చిరంజీవి నటించిన సినిమాలలోని  వందల సాంగ్స్ బాలు పాడారు.

కాగా రేపు ఆయన 65వ పుట్టినరోజు, ఫ్యాన్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా భౌతికమైన వేడుకలు లేకపోయినా సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు. ఐతే చిరంజీవి ఈ పుట్టినరోజు పట్ల అసలు ఆసక్తి చూపడం లేదు. బాలు ఆరోగ్యం విషమంగా ఉండగా ఆయన మనసు వేడుకల వైపు మళ్లడం లేదట. ఆయన పూర్తిగా మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు సమాచారం. మరో వైపు కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. దీనితో తన 65వ పుట్టినరోజు పట్ల చిరు హ్యాపీగా లేరట.
 

click me!