ఇంట్రస్టింగ్ వీడియోను షేర్‌ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌

Published : Aug 21, 2020, 12:44 PM IST
ఇంట్రస్టింగ్ వీడియోను షేర్‌ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌

సారాంశం

తాజాగా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా అలాంటి వీడియోనే షేర్ చేశాడు. ఓంత చిన్న పురుగు తన ప్రయత్నంలో ఎలా విజయం సాదించింది అనే ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. `ఈ చిన్ని ప్రాణి నుంచి కూడా ఈ రోజు మనం నేర్చుకోవాలి` అంటూ కామెంట్ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌.

కరోన కారణంగా సినిమా షూటింగ్‌లు పూర్తిగా ఆగిపోయాయి. ఎప్పుడూ ప్రయాణాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టార్స్‌ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉంటున్నారు. దీంతో అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు తారలు. ఎక్కువ మంది తమ వర్క్‌ అవుట్‌ ఫోటోస్‌ వీడియోను షేర్ చేస్తుండగా మరికొంత మంది ఇన్స్‌పైరింగ్‌, ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా అలాంటి వీడియోనే షేర్ చేశాడు. ఓంత చిన్న పురుగు తన ప్రయత్నంలో ఎలా విజయం సాదించింది అనే ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. `ఈ చిన్ని ప్రాణి నుంచి కూడా ఈ రోజు మనం నేర్చుకోవాలి` అంటూ కామెంట్ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. వండర్‌ ఆఫ్‌ సైన్స్ అనే ట్విటర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోను సాయి ధరమ్‌ తేజ్‌ రీ ట్వీట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ప్రతీ రోజూ పండగే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా లాక్ డౌన్‌ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

PREV
click me!

Recommended Stories

OTT Movies: టీమ్ లీడ్ తో ఆఫీస్ లో రొమాన్స్..ఈ వారం ఓటీటీలో అదిరిపోయే యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!