చిరు టైటిల్ తో విజయ్ దేవరకొండ!

Published : Dec 15, 2018, 08:09 AM IST
చిరు టైటిల్ తో విజయ్ దేవరకొండ!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ని వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. మెగా ఫ్యామిలీ నుండి వారసులుగా వచ్చిన హీరోలు చిరు టైటిల్స్ ని వాడుకోవడం, ఆయన సినిమాల్లో పాటలను రీమిక్స్ చేయడం చూస్తూనే ఉన్నాం

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ని వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. మెగా ఫ్యామిలీ నుండి వారసులుగా వచ్చిన హీరోలు చిరు టైటిల్స్ ని వాడుకోవడం, ఆయన సినిమాల్లో పాటలను రీమిక్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మెగాస్టార్ టైటిల్ ను వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సహానిర్మాతగా వ్యవహరిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విజయ్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. దానికి విజయ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి టైటిల్ గా ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన 'హీరో' అనే సినిమా పేరుని వాడుకోబోతున్నారట.

మధ్యలో హీరో నితిన్ కూడా ఈ టైటిల్ ని వాడుకున్నారు. ఇప్పుడు విజయ్ సినిమాకి కూడా ఇదే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా దర్శకుడు ఇతర విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.  

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్