బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతోన్న టాలీవుడ్ దర్శకుడు!

Published : Dec 14, 2018, 08:03 PM IST
బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతోన్న టాలీవుడ్ దర్శకుడు!

సారాంశం

టాలీవుడ్ యువ దర్శకుల్లో ఊహించని విధంగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో సంకల్ప్ రెడ్డి ఒకరు. ఘాజి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ అంతరిక్షం సినిమాతో రాబోతున్నాడు. సెన్సార్ పనులను కూడా ముగించుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. చిత్ర దర్శకుడు సంకల్ప్ నెక్స్ట్ డైరెక్ట్ గా బాలీవుడ్ కి షిఫ్ట్ కానున్నాడట. ఈ సినిమాకంటే ముందే రెండు కథలను సిద్ధం చేసుకున్న సంకల్ప్ హిందీలో తరువాత ప్రాజెక్టులను చిత్రీకరించడానికి నిర్మాతలతో ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాడు. ఘాజి సినిమాతోనే సంకల్ప్ కి బాలీవుడ్ నుంచి పిలుపులు వచ్చాయి. 

ఈ విషయాన్నీ అంతరిక్షం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంకల్ప్ తెలిపాడు. ఇక అంతరిక్షం సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా కథ రాసుకోగానే ముందుగా వరుణ్ గుర్తుకువచ్చాడు అని అతనే ఈ కథకు సరైన న్యాయం చేయగలడని అనుకున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఇక సినిమా కోసం క్రిష్ కూడా చాలా సహాయపడ్డారని ఆయన నిర్మాతగా వ్యవహరించడం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.   

PREV
click me!

Recommended Stories

Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే
Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?