జన్మజన్మలకు నీ కడుపునే పుట్టాలి... చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

By Sambi ReddyFirst Published Jan 29, 2023, 3:44 PM IST
Highlights


చిరంజీవి తల్లి గారైన అంజనాదేవి పుట్టినరోజు నేడు. ఈ విషయాన్ని మెగాస్టార్ తన అభిమానులకు తెలియజేశారు. తల్లి బర్త్ డే వేడుకల ఫొటోలతో పాటు శుభాకాంక్షలతో కూడిన భావోద్వేగ సందేశం పంచుకున్నారు. 
 

అమ్మ అంజనాదేవి అంటే చిరంజీవికి ప్రాణం. అంజనాదేవికి ఐదుగురు సంతానం ఉన్నప్పటికీ చిరంజీవి తల్లిని తన వద్దే ఉంచుకొని ప్రేమగా చూసుకుంటున్నారు. అంజనాదేవి చేతి వంట అంటే చిరంజీవికి మహా ప్రీతి. అప్పుడప్పుడు అమ్మతో పాటు కిచెన్ లో ఆయన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అమ్మకు ఇష్టమైన వంటకాలు స్వయంగా చేసి వడ్డిస్తారు. చిరుకు అది ఇష్టమైన వ్యాపకం. నేడు అంజనాదేవి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

అంజనాదేవి పుట్టినరోజు నాడు తన ఐదుగురు పిల్లలు చిరంజీవి ఇంటికి చేరుకుంటారు. ఈ ఏడాది కూడా నాగబాబు, పవన్, ఇద్దరు కూతుళ్లు అంజనాదేవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. రామ్ చరణ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా వేడుకల్లో భాగమయ్యారు. ఈ ఫోటోలు చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మాకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. జన్మజన్మలకు మీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను.. అని చిరంజీవి ఎమోషనల్ విషెస్ తెలియజేశారు. 

అంజనాదేవి బర్త్ డే విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. చిరు తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  అంజనాదేవి-వెంకట్రావు దంపతులకు చిరంజీవి 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించారు. పెద్దవాడైన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా వెండితెరను ఏలారు. సిల్వర్ స్క్రీన్ కింగ్ అయ్యారు. ఆయన నీడలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్స్ గా ఎదిగారు. చిరంజీవి అనే వటవృక్షం క్రింద మెగా హీరోలు అనే ఓ బ్రాండ్ పుట్టింది. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు టాప్ హీరోలు ఉన్నారు. మరో ముగ్గురు టైర్ టూ హీరోలు తయారయ్యారు. 

చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవికి భారీ హిట్ పడింది. గత ఏడాది చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అయ్యారు 

click me!