విషాదం..రాఖీ సావంత్ తల్లి మృతి.. అంతులేని దుఃఖంతో బోరున ఏడ్చేసిన నటి

Published : Jan 29, 2023, 03:16 PM ISTUpdated : Jan 29, 2023, 03:17 PM IST
విషాదం..రాఖీ సావంత్ తల్లి మృతి.. అంతులేని దుఃఖంతో బోరున ఏడ్చేసిన నటి

సారాంశం

రాఖీ సావంత్ తల్లి జయ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ దైర్యంగా ఉండే రాఖీసావంత్ తన తల్లి మృతితో బోరున ఏడ్చేస్తోంది. రాఖి సావంత్ ఇలా చూస్తుంటే ఆమె సన్నిహితులకు, అభిమనులకు కూడా దుఃఖం ఆగడం లేదు.

రాఖీ సావంత్ అంటే బాలీవుడ్ లో ఒక ఫైర్ బ్రాండ్. ఎన్ని వివాదాలు ఎదురైనా తన పంథా తనదే అంటూ ముందుకు వెళుతోంది. రాఖీ సావంత్ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆమె కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన మహిళే. తాజాగా రాఖీ సావంత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 

రాఖీ సావంత్ తల్లి జయ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ దైర్యంగా ఉండే రాఖీసావంత్ తన తల్లి మృతితో బోరున ఏడ్చేస్తోంది. రాఖి సావంత్ ఇలా చూస్తుంటే ఆమె సన్నిహితులకు, అభిమనులకు కూడా దుఃఖం ఆగడం లేదు. తన తల్లి పక్కన కూర్చుని కన్నీరు మున్నీరు అవుతున్న రాఖీసావంత్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చాలా కాలంగా రాఖీ సావంత్ తల్లి జయ బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ తో పోరాడుతున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈ విషయాన్ని రాఖీ భర్త ఆదిల్ కూడా ధ్రువీకరించారు. తన తల్లి మరణ వార్తని రాఖీ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. 

తన తల్లి చివరి క్షణాల వీడియో షేర్ చేసింది. తన తల్లిని ఆ స్థితిలో చూస్తూ రాఖీ సావంత్ ఏడుపు ఆపుకోలేకపోయింది. దీనితో రాఖీ సావంత్ కి బాలీవుడ్ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె తల్లి మృతికి సంతాపం తెలుపుతున్నారు. మీ తల్లి ఎక్కడ ఉన్నా ఆమె ఆశీస్సులు నీకు ఉంటాయి.. ధైర్యంగా ఉండు అంటూ సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. 

నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి ఇక నా తలపై ఉండదు. నేను కోల్పోవడానికి ఏమీ లేదు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్ యు అమ్మా అంటూ రాఖీసావంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: సొంత తండ్రినే చంపేందుకు తెగించిన జ్యోత్స్న.. కార్తీక్‌ ఆమె ట్రాప్‌లో పడ్డడా?
Illu Illalu Pillalu: గేటు బయటే శ్రీవల్లి తల్లిదండ్రులకు అవమానం..ప్రేమ హార్ట్ బ్రేక్ చేసిన ధీరజ్