
ఏపీలో టాలీవుడ్ కు – ప్రభుత్వానికి సినిమా టికెట్ల వివాదం గట్టిగా నడుస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లూడుతున్నారు. వివాదం రకరకాల మలుపులు తిరుగుతున్న వేళ.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈరోజు ముఖ్యంమత్రి వైస్ జగన్(Y.S.Jagan) ను కలవనున్నారు. మరో వైపు మోహన్ బాబు గుడ్ న్యూస్ చెపుతారంటూ.. మంచు విష్టు ట్వీట్ చేయడం పెద్ద చర్చకు దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం రకరకాల మలుపులు తీరుగుతుంది. ఇండస్ట్రీ నుంచి ఎన్ని ప్రయత్నులు చేసినా.. ఏపీ ప్రభుత్వం బెట్టు వీడటం లేదు. పైగా సినిమా వాళ్లు ఏది మాట్లాడినా దానికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు. అటు ప్రభుత్వ పెద్దలు.. ఇటు టాలీవుడ్ పెద్దలు మాటల వేడితో వివాదం ముదురుతుంది తప్పించి కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Y.S.Jagan)ని కలవబోతుండటం చర్చనీయంగా మారింది.
టికెట్ల విదాదం నడుస్తున్న టైమ్ లో సినిమా పెద్దలు ఎవరు వెళ్లినా..మంత్రులు మాత్రమే కలుస్తున్నారు. కాని జగన్ మాత్రం ఎవరికి కలవడం లేదు. ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ దోరికింది. దాంతో ఇఫ్పుడైనా ఈ విషయం పై క్లారిటీ వస్తుందన్న ఆశతో ఉన్నారు టాలీవుడ్ సినిమా పెద్దలు. చిరంజీవి(Chiranjeevi ) జగన్ ను కలిసి ఇండస్ట్రీ ఇబ్బందుల పై జగన్ కు వివరంగా చెపుతారన్న నమ్మకంతో ఉన్నారు టాలీవుడ్ జనాలు.
మరో వైపు మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. దేవుడి దయ వల్ల త్వరలో మోహన్ బాబు (Mohan Babu) గారు గొప్ప వార్తను అనౌన్స్ చేయబోతున్నారు అంటూ విష్ణు ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో టికెట్ ఇష్యూ నడుస్తున్న టైమ్ లోనే ఇటు.. చిరంజీవి, మోహన్ బాబు మధ్య కూడా కనిపించని వార్ నడుస్తుంది. మోహన్ బాబు(Mohan Babu) విషయంలో హర్ట్ అయిన చిరంజీవి ఈమధ్య సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని చెప్పారు. ఆ బరువు తనకు వద్దన్నారు. అనవసర విషయాల్లో వేలు పెట్టనన్నారు. ఇండస్ట్రీ కోసం నలుగురితో కలిసి నడవమంటే నడుస్తాను కాని.. ఇండస్ట్రీ పెద్దగా తీర్పులు ఇవ్వడానికి మాత్రం నేను ముందు ఉండటన్నారు.
అటు మోహన్ బాబు ఈ వివాదం పరిష్కారం కోసం ప్రతయత్నిస్తాను అంటూ మోహన్ బాబు.. ఇండస్ట్రీకి పెద్దన్నగా నిలబడే ప్రయత్నం చేశారు.జగన్ ను కలవాలని కూడా ప్రయత్నించినట్టు సమాచారం. కాని మోహన్ బాబు(Mohan Babu) కంటే ముందు చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం. ఇదే టైమ్ లో మోహన్ బాబు గుడ్ న్యూస్ చెపుతారంటూ విష్ణు ట్వీట్ చేయడంతో.. ఇండస్ట్రీ ఒకింత కన్ ఫ్యూజన్ లో పడింది. ఇంతకీ ఈ విషచం కొలిక్కి వస్తుందా లేదా అనే అనుమానం సినిమా పెద్దల్లో కలుగుతోంది.
మరో వైపు ఇండస్ట్రీ లో టికెట్ల ష్యూపూ స్టాండ్ తీసుకుని పోరాడుతున్నారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). మంత్రి నానీని కూడా కలిసారు. వరుస గా ఆధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కౌంటర్ లు వేస్తూ.. తన మార్క్ ట్వీట్ల తో సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలో వైసీపి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టించాయి. సినిమా వాళ్శు బలిసి కొట్టుకుంటున్నారు అన్న ఆయన కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ మీ ఆస్తులు.. మా ఆస్తుల గురించి తేల్చుకుందాం అన్ని గట్టిగానే సమాధానం చెప్పారు.
దర్శక నిర్మాత విఎన్ ఆదిత్య(V.N Aditya) కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. ఆ మాట వినగానే మనస్సు చివుక్కు మందని అన్నారు. ఈ మాటలు మాట్లాడిన అతని కంటే.. సినిమా వాళ్లే ఎక్కువ ప్రజా జీవితంలో ఉంటారని..అలాంటప్పుడు సినిమా వాళ్లకు బలుపు ఎందుకు ఉండకూడదంటూ.. గట్టిగానే నిలదీశారు. ఇండస్ట్రీలో కూడా బలుపు వ్యాఖ్యలు హిట్ పుట్టించాయి. ఇండస్ట్రీ పెద్దలు అంతా ఈ మాటలపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి తగ్గేదే లే అంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఇండస్ట్రీ వాళ్లు ఎలా తేల్చుకుంటారు...? జగన్ తో చిరు మీటింగ్ లో క్లారిటీ ఏమైనా వస్తుందా..? మోహన్ బాబు చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటీ...? ఇవి తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
Also Read :Chiranjeevi - YS Jagan: నేడు సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న చిరంజీవి..