నా సినిమాకే పోటీగా రిలీజ్ చేస్తావా.. స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 13, 2022, 10:11 AM IST
నా సినిమాకే పోటీగా రిలీజ్ చేస్తావా.. స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడడంపై మాట్లాడారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి థియేటర్స్ లో విజిల్స్ మోత వినిపించేది.  కానీ ఏం చేస్తాం.. ఆర్ఆర్ఆర్ కోసం ఇంకా వెయిట్ చేస్తాం అని అనిల్ రావిపూడి అన్నారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎప్పుడూ కూల్ గా ఉంటారని ఇండస్ట్రీలో టాక్. ఎవరితో అయినా రాంచరణ్ సరదాగా మాట్లాడతారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశీష్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆశీష్ హీరోగా దిల్ రాజు 'రౌడీ బాయ్స్' అనే చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీనితో వరుసగా రౌడీ బాయ్స్ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ మ్యూజికల్ నైట్స్ పేరుతో నిన్న ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ కూడా హాజరయ్యారు. 

అనిల్ రావిపూడి ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ రాంచరణ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడడంపై మాట్లాడారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి థియేటర్స్ లో విజిల్స్ మోత వినిపించేది.  కానీ ఏం చేస్తాం.. ఆర్ఆర్ఆర్ కోసం ఇంకా వెయిట్ చేస్తాం అని అనిల్ రావిపూడి అన్నారు. 

 హీరోలంతా బంగారం.. రాంచరణ్ ఇంకా మంచి బంగారం. ఎలాంటి సమస్య వచ్చినా మన హీరోలు ముందుంటారు అని అనిల్ రావిపూడి అన్నారు. బాగా నటించినంత మాత్రాన హీరో అయిపోరు. మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి అని అనిల్ అన్నారు. 

రాంచరణ్ గారిని రాజమౌళి గారి కొడుకు మ్యారేజ్ ఫంక్షన్ లో తొలిసారి కలిశాను. ఆ టైం లో నా ఎఫ్2 మూవీ, రాంచరణ్ గారి మూవీ ఒకేసారి విడుదలవుతున్నాయి. ఆయన నన్ను పక్కకు పిలిచి ఏంటి నామీదకే పోటీగా వస్తున్నావా అని అడిగారు. ఒక్క క్షణం నాకేమి అర్థం కాలేదు. టెన్షన్ పడ్డాను.. వెంటనే రాంచరణ్ నన్ను హగ్ చేసుకుని నీ మూవీ పెద్ద హిట్ కావాలి అని విష్ చేశారు. అది రాంచరణ్ వ్యక్తిత్వం అంటూ అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. ఎఫ్2 , రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రాలు 2019లో ఒకసారి విడుదలయ్యాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి