మెగాస్టార్ స్టన్నింగ్ లుక్స్.. సైరా కోసం జిమ్ బాడీ

Published : Dec 04, 2017, 05:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మెగాస్టార్ స్టన్నింగ్ లుక్స్.. సైరా కోసం జిమ్ బాడీ

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెెడ్డి సైరా నరసింహారెడ్డి లో లీడ్ రోల్ కోసం మెగాస్టార్ మే క్ ఓవర్ ఫిట్ నెస్ సెంటర్ లో కెమెరాకు చిక్కిన మెగాస్టార్ స్టన్నింగ్ లుక్స్ పిక్

మెగాాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 151వ చిత్రం ‘సైరా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నెం.150 మూవీ తరువాత చిరంజీవి.. ఉయ్యల వాడ నరసింహారెడ్డిగా ప్రేక్షకులను అలరించేందుకు మేకోవర్ మొదలుపెట్టాడు. గత ఆగష్టు నెలలో ‘సైరా’ మూవీ లాంఛ్‌ కాగా.. డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో చిరు సైరా మూవీ కోసం మేకోవర్‌పై శ్ర‌ద్ధ పెట్టారు. తాజాగా చిరు జిమ్‌లో క‌స‌రత్తులు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 


బ్రిటీష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో అద్భుత ఘట్టాలను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నాజర్, ముకేశ్ రుషి, రఘుబాబు, సుబ్బరాజు తదితర నటీనటులు నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు