నేచురల్ స్టార్ నాని ప్రతి చిత్రాన్ని చిరంజీవి వీక్షిస్తారట. వెంటనే నానికి చిరు స్వయంగా టైప్ చేసి మెసేజ్ చేస్తారట. ఈ విషయాన్ని నాని తాజాగా సరిపోదా శనివారం చిత్రం ప్రచార కార్యక్రమాల్లో తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కొత్త తరం నటీనటులను ప్రోత్సాహిస్తున్నారు. మంచి సినిమా ఏది వచ్చినా చిరు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందిస్తున్నారు. మంచి నటన కనబరిస్తే ఆ నటీనటులకు, దర్శకులకు ఫోన్ చేసి అభినందించడం కూడా జరుగుతూ ఉంటుంది.
నేచురల్ స్టార్ నాని ప్రతి చిత్రాన్ని చిరంజీవి వీక్షిస్తారట. వెంటనే నానికి చిరు స్వయంగా టైప్ చేసి మెసేజ్ చేస్తారట. ఈ విషయాన్ని నాని తాజాగా సరిపోదా శనివారం చిత్రం ప్రచార కార్యక్రమాల్లో తెలిపారు. దసరా చిత్రానికి ఫోన్ చేసి అభినందించారు. ఒకసారి చిరంజీవిని నాని కలసినప్పుడు ఆసక్తికర విషయం తెలిపారట.
నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కమర్షియల్ గా ఈ చిత్రం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే చిరంజీవికి ఈ మూవీ విపరీతంగా నచ్చేసిందట. శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చిరు తన సతీమణి సురేఖ తో కలసి హోమ్ థియేటర్ లో చూశారట.
సినిమాలో బాగా లీనమైపోయారు. నాని పెర్ఫామెన్స్ చాలా బాగా నచ్చిందట. మధ్యలో సిబ్బంది స్నాక్స్ తీసుకువస్తే ఎందుకు డిస్ట్రబ్ చేస్తారు అని తిట్టినట్లు నాని తెలిపారు. అంత బాగా ఆ మూవీ నచ్చేసింది. పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్యామ్ సింగరాయ్ చిత్రం గురించి చిరు దంపతులు తన తో చాలా సేపు మాట్లాడారని.. వారి మాటలకు ఫిదా అయ్యాయని నాని తెలిపారు.