నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. బాలయ్య మాటలు నిజం అయ్యాయి అంటున్న ఫ్యాన్స్ ?

By tirumala AN  |  First Published Aug 26, 2024, 6:44 AM IST

ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంతో గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో బాలయ్య చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. 


అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది ప్రస్తుతం సంచలన అంశంగా మారింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపిస్తునారు. అక్రమ కట్టడాలపై వెనక్కి తగ్గేది లేదని, ఉక్కు పాదం మోపుతాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంతో గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో బాలయ్య చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదం తెరపైకి రావడంతో బాలయ్య కామెంట్స్ ని కూడా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ గురించి చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు జరిపారు. కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ పై బాలయ్య అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఒక్కరు కూడా ఇన్వైట్ చేయలేదు. వీళ్లంతా కూర్చుని భూములు పంచుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నది రియల్ ఎస్టేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, బాలయ్య మాటలు చూస్తుంటే.. అప్పుడు బాలయ్య చెప్పిందే నిజం అనిపిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్ లు మొదలు పెట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో నాగార్జున కి కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు కూల్చేవేత కరెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా నాగార్జున ఈ వివాదంలో హై కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతానికి నాగ్ కి ఊరటగా కోర్టు స్టే ఇచ్చింది. భవిష్యత్తులో కోర్టు ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం అని నాగార్జున ఖండించారు. సెంటు భూమిని కూడా తాను ఆక్రమించలేదని తెలిపారు. 

click me!