మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. చిరు లైనప్ లో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో చిరంజీవి తన పెద్ద కూతురు కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడాది సమయంలోనే మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరిగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘భోళా శంకర్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ఇప్పటికే మెగాస్టార్ లైనప్ లో నాలుగు చిత్రాలు ఉన్నాయని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాటికి సంబంధించిన డిస్కషన్స్ కొనసాగుతున్నాయని త్వరలో ఫైనల్ కాబోతున్నాయని సమాచారం. ఇందులో రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. తొలుత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నారు. ఆ తర్వాత బింబిసార దర్శకుడు వశిష్టతో సినిమా చేయనున్నారు.
అయితే, ఈక్రమంలోనే తన పెద్ద కూతురు సుష్మిత (Sushmita) కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుష్మిత క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం నిర్మాతగానూ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. సుష్మిత కెరీర్ ను ప్రొడ్యూసర్ గా గాడీలో పెట్టేందుకు మెగాస్టార్ కీలక నిర్ణయం తీసుకున్నారంట. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీకి సుష్మితతో ప్రొడ్యూస్ చేయిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ‘సైరా’తో రామ్ చరణ్ ను ప్రొడ్యూసర్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుష్మితను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ‘భోళా శంకర్’ రిలీజ్ పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.